స్టార్ డైరెక్టర్ శంకర్…. తన శిష్యుడ్ని అల్లుడుగా చేసుకొంటున్నాడు. తన పెద్దకుమార్తె ఐశ్వర్య శంకర్ ని తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తరుణ్ కార్తీక్కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడు. వీరిద్దరి నిశ్చితార్థం ఆదివారం రాత్రి చెన్నైలో ఘనంగా జరిగింది. త్వరలోనే పెళ్లి ముహూర్తం ఖరారు చేస్తారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇండియన్ 2’, ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలకు కార్తీక్ సహాయకుడిగా పని చేస్తున్నాడు. ఐశ్వర్య తమిళంలో కథానాయికగా పలు చిత్రాల్లో నటించారు. ఆమె గాయని కూడా. ‘గని’ చిత్రంలో తమన్ సంగీత సారధ్యంలో ఆమె ఓ పాట పాడారు. ఐశ్వర్యకు ఇది రెండో వివాహం కావడం విశేషం. గతంలో రోహిత్ అనే ఓ క్రికెటర్ని పెళ్లి చేసుకొన్నారు. వీళ్ల కాపురం యేడాది కూడా సజావుగా సాగలేదు. ఆ తరవాత మనస్పర్థలతో విడాకులు తీసుకొన్నారు. ఇప్పుడు కార్తీక్ తో కొత్త జీవితం ప్రారంభించనున్నారు.