ఇటీవల ధనుష్ – ఐశ్వర్య ఇద్దరూ విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వారిద్దరూ అధికారికంగానే ప్రకటించారు. అయితే ఇప్పుడు విడాకులు వెనక్కి తీసుకొని, కలిసి జీవించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకోవడంతో రజనీ, ఆయన కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. వారిద్దరినీ కలపడానికి రజనీ విశ్వ ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అయితే… ఆ సమయంలో అవేం వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం… రజనీ ప్రయత్నాలు సఫలం అయినట్టు తెలుస్తోంది. విజయదశమి రోజున… రెండు కుటుంబాలూ కలిసి ఓ కీలక నిర్ణయం తీసుకొన్నాయని, కలిసి ఉండడానికే నిర్ణయించుకొన్నారని సమాచారం అందుతోంది. కోర్టులో విడాకుల పిటీషన్ని వెనక్కి తీసుకొని, కలిసి జీవించాలని నిర్ణయానికి వచ్చారని సమాచారం. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చాక.. ఆ విషయాన్ని రజనీ కుటుంబమే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సెలబ్రెటీలు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం మామూలే. అందులో చాలా జంటలు విడాకులు తీసుకొన్నాయి. అయితే విడాకులు తీసుకొన్న తరవాత వాటిని రద్దు చేసుకొని, ఇలా మళ్లీ కలిసిపోవాలనుకోవడం వీరిద్దరికే సాధ్యమైందేమో? ఏదైతేనేం.. ఓ జంట మళ్లీ కలుస్తోంది. ఆనందమే కదా..?!