సరిహద్దుల్లో చెక్ పోస్టులను… స్పందన యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. ఏ ఆటంకాలు లేకుండా రాకపోకలు సాగిస్తున్నారు ప్రజలు . అన్లాక్ ప్రకటించినా కొన్ని రాష్ట్రాలు ఇంకా… సరిహద్దుల్లో ప్రయాణికులు, సరకు రవాణా వాహనాలపై ఆంక్షలు విధించడం కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఈ మేరకు.. ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని స్పష్టంగా నిర్దేశిస్తూ.. ఓ లేఖను కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలకూ పంపారు. రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని .. సరుకు రవాణా, వ్యక్తుల రాకపోకలకు అనుమతుల అవసరం లేకుండా చేయాలని స్పష్టం చేశారు.
కొన్ని రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దుల మధ్య ఆంక్షలు ఉన్నట్లు మా దృష్టికొచ్చిందిని .. ఆంక్షల వల్ల ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి దెబ్బతింటుందని అజయ్ భల్లా లేఖలో అసంతృప్తి వ్యక్తంచేశారు. రాకపోకలపై రాష్ట్రాల ఆంక్షలు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు వ్యతిరేకమని .. ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని మార్గదర్శక సూత్రాలకు కూడా విరుద్ధంమని స్పష్టం చేశారు. తక్షణం సరిహద్దుల్లో ఆంక్షల్లేకుండా స్వేచ్ఛగా తిరిగే అవకాశం కల్పించాల్సిందేనన్నారు. ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలు దక్షిణాదిలో ఏపీ లాంటి రాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి.
నిన్నటిదాకా స్పందన యాప్లో రిజిస్టర్ చేసుకుంటే మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు. అలాగే సరకు రవాణా వాహనాలనూ అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లాక్ డౌన్ అమలు చేస్తున్న మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లడంతో.. కేంద్ర హోంశాఖ నుంచి ఈ ఉత్తర్వులు వచ్చినట్లుగా తెలుస్తోంది. కేంద్రం చాలా సీరియస్గా స్పందిండంతో అధికారులు సైతం వెనక్కి తగ్గారు. ఇంత కాలం… ఏపీలోకి రావాలంటే.. తమ అనుమతి ఉండాల్సిందేనన్నట్లుగా వ్యవహరించిన తీరుతో.. చాలా మంది స్వరాష్ట్రానికి వెళ్లలేక ఇప్పందులు పడ్డారు.