అజయ్‌భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `మహా సముద్రం`. శర్వానంద్ హీరో. సిద్దార్థ్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలోని `రంభ.. రంభ` పాట నిన్ననే (శుక్రవారం) విడుదలైంది. ఇదో మంచి మాస్ బీట్. పాటలో రంభ లేదు గానీ… దర్శకుడికి రంభపై ఉన్న అభిమానం మాత్రం కనిపించింది. స్వతహాగా.. అజయ్ భూపతి రంభకి పెద్ద అభిమాని అట. రంభని ఎలాగైనా సరే, ఈ సినమాలో చూపించాలని అనుకున్నాడట. రంభ ని తీసుకురాకపోయినా, ఆమె కటౌట్లు చూపించి, ఆ లోటు తీర్చుకున్నాడు.
అయితే రంభ పై పాట తెరకెక్కించాలన్న ఆలోచన రాగానే.. ఈ విషయాన్ని చెన్నైలో ఉన్న రంభ దృష్టికి తీసుకెళ్లాడట. రంభపై భాస్కర భట్ల రాసిన పాటని సైతం.. తనకి వినిపించి, రంభ అనుమతి తీసుకున్నాడట. `పాటే కదా.. ఫర్వాలేదు.. పెట్టేయండి` అంటూ రంభ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో… అజయ్ భూపతి ప్రొసీడ్ అయిపోయాడు. తెలుగు తెరపై రంభ కనిపించి చాలా రోజులైపోయింది. కనీసం మహా సముద్రంలో రంభ కటౌట్లనీ, తన ఫ్యాన్స్ (శర్వా, జగపతి) చేసే హంగామానైనా చూసే అవకాశం దక్కబోతోంది. అజయ్ భూపతి అయితే.. తన తదుపరి సినిమాలో రంభ కోసం స్పెషల్ గా ఓ పాత్ర సృష్టించే పనిలో ఉన్నాడన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.