హీరో అయినా నిజం చెప్పాడు అజయదేవగన్. రాజకీయ సమస్యలు వచ్చినప్పుడు సినిమా వాళ్లం లొంగిపోకతప్పదని ఆయన వ్యాఖ్యానించాడు. దీనికి నేపథ్యం ఏమిటంటే కరణ్ జోహార్ వివాదం.
తన చిత్రం ఏ దిల్హైముష్కిల్ ఎలాగైనా విడుదల చేయించుకోవడం కోసం నిర్మాత దర్శకుడు కరణ్‌జోహార్ అందరికన్నా ముందే పాకిస్తాన్ కళాకారులకు చోటు వుండకూడదనే ప్రచారం ప్రారంభించారు. ఈ నెల 28న విడుదల కావలసిన ఆయన చిత్రంలో ఫరాద్ ఖాన్ అనే పాక్నటుడున్నాడు అయినా శివసేన వంటి శక్తులు ఆ చిత్రానికి అడ్డు పడుతున్నాయి. చివరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడనవిస్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అద్యక్షుడు రాజ్థాకరేలతో చర్చలు జరిపి విడుదలకు అనుమతి పొందాడు. చిత్రంలో మొదటే యురి మృతులకు జోహారులర్పించడమే గాక పాక్ టెర్రరిజాన్ని ఖండిస్తారట. ఇక ముందు పాక్ కళాకారులను తీసుకోనని కూడా ప్రకటించారు. అయితే ఈ సందర్భంలో భారత సైనిక సంక్షేమ నిధికి అయిదు కోట్ల విరాళం ఇవ్వాలని రాజ్ షరతు పెట్టడం కరణ్ అంగీకరించడం జరిగిపోయింది. ఇప్పటికే పాక్ నటులతో రూపొందిన ఏ చిత్రం విడుదల కావాలన్నా 5 కోట్ల విరాళం ఇవ్వాలట. నిర్మాత ఒప్పుకున్నాడు గాని మాజీ సైనికాధికారులు మాత్రం ఇదేం రాజకీయమని మండిపడ్డారు. సైన్యం విషయంలో బయిటవారి జోక్యం మంచిది కాదని హితవు చెప్పారు.ఇది ఇలా వుంటే థియేటర్ యజమానులు మాత్రం విడుదలకు ఒప్పుకునేది లేదంటున్నారింకా.
ఈ చిత్రానికి పోటీగా లేక దాంతో పాటుగా విడుదల కావలసిన సినిమా అజరుదేవగన్ శివయ్య. ఆయన కూడా ఈ ఉద్రిక్తత ప్రభావానికి గురయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూనే మేము సినిమా వాళ్లం చాలా ఖర్చు చేసి తీస్తాం.విడుదల కాకపోతే ఎన్నొ సమస్యలు వస్తాయి. కాబట్టి రాజకీయ నేతలకు అడ్డుపడే వారికి తలవంచాల్సిన స్తితిలో వుంటాం. అయినా అన్నీ పరిష్కారం కాకపోవచ్చు అని స్పష్టంగా చెప్పేశాడు. గతంలోనూ మణిరత్నం ముంబాయి చిత్రానికి అప్పటికి బతికి వున్న బాల్ థాకరే అడ్డంకులు కల్పించడం, చివరకు ముందే చూసి మార్పులు చెప్పడం గుర్తుండేవుంటుంది. ఈ క్రమంలో చివరకు చిత్రంలో ఆయన పాత్రను మెతగ్గానూ మరో మతానికి చెందిన వారిని యథాతథంగానూ చూపించడంతో పట్టుతగ్గింది.