సాధారణంగా హీరోలు సిక్స్‌ప్యాక్ చేస్తుంటారు. పాటలోనో, ఫైటులోనో చొక్కా విప్పితే ఫ్యాన్స్సంతోషిస్తారని వాళ్ల నమ్మకం. అయితే… విలన్లు సిక్స్ ప్యాక్ చేయడం చాలా అరుదుగా జరిగే విషయం. ఇప్పుడు అజయ్ అదే చేస్తున్నాడు. దశాబ్దకాలంగా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అప్పుడప్పుడూ హీరోగా అలరిస్తూనే వచ్చాడు అజయ్. ఇప్పుడు నవతరం విలన్ల తో పోటీ ఎక్కువైంది. వాళ్లని తట్టుకోవడానికేమో.. తన బాడీపై దృష్టి పెట్టాడు. అజయ్ సిక్స్ ప్యాక్వైపు దృష్టి మరల్చాడు. జిమ్‌లో సిక్స్ ప్యాక్ కోసం భారీగా కసరత్తులు చేస్తున్నాడు. అజయ్ చేతిలో దాదాపు అరడజను సినిమాలున్నాయి. మరి వాటిలో ఏ సినిమా కోసం ఇలా… ఆరు పలకల దేహంతో కనిపించనున్నాడో చూడాలి. అన్నట్టు అజయ్‌కి ఇప్పటికీ హీరోగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈమధ్యే స్పెషల్ అనే సినిమాలో కథానాయకుడిగా నటించాడు. మరి ఈ సిక్స్‌ప్యాక్ హీరో కోసమా? విలనిజం కోసమా? అనేది చూడాలి.