అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ కుప్పకూలింది. కానీ ఆ పటేల్ కూడా న్యూజిలాండ్ ప్లేయరే. కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో పది వికెట్లనూ తన ఖాతాలో వేసుకున్నాడు. 22 ఏళ్ల తర్వాత కుంబ్లే రికార్డును సమం చేశాడు అజాజ్ పటేల్. ముంబయి టెస్టు తొలిరోజు శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌ను ఔట్ చేశాడు. ఇక రెండోరోజు వరుసగా వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, మాయాంక్ అగర్వాల్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌ను పెవిలియన్ పంపించాడు.
ఆడుతున్నది భారత్‌లో.. ఔట్ చేసింది భారత్‌ని.. రికార్డు సృష్టించిన ఆటగాడు భారత సంతతి బౌలర్.. ఆఖరి క్యాచ్ అందుకున్నదీ భారత సంతతి వ్యక్తే.. అజాజ్ పటేల్ పుట్టింది ఇప్పుడు మ్యాచ్ జరుగుతున్న ముంబయి గడ్డపైనే. అలాంటిది అక్కడే అతడు టీమ్ఇండియాపై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల ఘనత అందుకున్నారు. 1956 మొదటి సారి ఇంగ్లాండ్ ఆటగాడు జిమ్‌లేకర్ ఈ రికార్డు సృష్టించాడు. దాన్ని బద్దలు కొట్టే మొనగాడు రావడం అసాధ్యమే అనుకుంటే..! 1999లో టీమ్ఇండియా దిగ్గజం అనిల్ కుంబ్లే దానిని సమం చేశాడు.
ముంబై పిచ్ రెండో రేజే బొలర్లకు స్వర్గధామంగా మారిపోయింది. న్యూజిలాండ్ 38 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్లు, పేసర్లు కలిసి ఓ ఆట ఆడుకున్నారు. సిరాజ్‌కు మూడు వికెట్లు లభించాయి. ఈ పరిస్థితి చూస్తే కివీస్ ఫాలో ఆన్ అడి.. ఆ తర్వాత కూడా నిలబడటం కష్టమేనన్నట్లుగా ఉంది. తమ తరపున ఆడిన పటేల్ పది వికెట్లు తీశాడన్న ఆనందమే కివీస్‌కు మిగిలేలా ఉంది.