సంక్రాంతికి తెలుగులో ఎన్ని పెద్ద సినిమాలు ఉన్నా ఒక డబ్బింగ్ సినిమా ఏదోరకంగా లైన్ లోకి వస్తుంటుంది. గతంలో దిల్ రాజు నిర్మించిన ‘వారసుడు’ సినిమా విషయంలో పెద్ద రచ్చె జరిగింది. ఏదేమైనాప్పటికీ దిల్ రాజు ఆ సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేశారు.
ఈసారి కూడా ఒక డబ్బింగ్ సినిమా సంక్రాంతికి వస్తామని దాదాపు ఓ ఆరు నెలల క్రితమే ప్రకటించుకుంది. అదే అజిత్.. గుడ్ బ్యాడ్ అగ్లీ. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మాతలు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ ఏ స్టేజ్ లో ఉందో క్లారిటీ లేదు. గతంలో ఏవో ఫస్ట్ లుక్ లాంటివి రిలీజ్ చేశారు. అంతకుమించి ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ బయటికి రాలేదు.
అయితే ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అని మొదట నుంచి చెబుతున్నారు. ఎందుకంటే అజిత్ కి ఇది తమిళ్ లో సోలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అదే రోజున తెలుగులో కూడా రిలీజ్ చేయాలనేది నిర్మాతల మొదటి ప్లాన్.
అయితే ఈ సినిమా అనుకున్నట్లు షూటింగ్ జరుగుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకో సినిమా గురించి ఆలోచించే వెసులుబాటు నిర్మాతలకు లేదు. అందుకే ప్రస్తుతం గుడ్ బాడ్ అగ్లీ డేట్ పై ఎలాంటి క్లారిటీ లేదు.
పైగా తమిళ్ లో కూడా ఇంకా డేట్ ఇవ్వలేదు. దీనికి కారణం ఆ సమయానికి సినిమా అందుకుంటుదో లేదో అనే డౌట్. మొత్తానికి అజిత్ సినిమా పరిస్థితి ప్రశ్నార్ధకంగానే వుంది.