అజిత్ తో మైత్రీ మూవీ మేకర్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాని నిర్మిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాని సంక్రాంతి 2025కి రిలీజ్ చేయాలని అనుకున్నారు. మొన్నటి వరకూ రిలీజ్ డేట్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ ఎదురుచూశారు. అయితే ఈ సినిమాని సంక్రాంతి తీసుకురావడం లేదని మొన్న పుష్ప చెన్నై ఈవెంట్ లో మేకర్స్ మాటలని ప్రకారం అర్ధమైయింది.
ఇక సంక్రాంతి అజిత్ సినిమా వుండదని భావిస్తున్న తరుణంలో సడన్ గా ఓ సినిమా సీన్ లోకి ఎంటర్ రైయింది. అదే అజిత్ ‘విడాముయర్చి’, లైకా ప్రొడక్షన్స్ లో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది.
త్రిష, అర్జున్, రెజీనా ఇలా భారీ తారగణమే వుంది. చాలా కాలంలో షూటింగ్ లో వున్న ఈ సినిమాని సంక్రాంతికి బరిలో దింపుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టీజర్‌ను కూడా వదిలారు. టీజర్ యాక్షన్ తో నిండిపోయింది. పూర్తిగా విదేశాల్లో చిత్రీకరించారు. అనిరుద్ సంగీతం మరో స్పెషల్ ఎట్రాక్షన్.
అజిత్ తో పాటు త్రిష, అర్జున్, రెజీనా, అనిరుద్, లైకా ప్రొడక్షన్స్ లాంటి ప్రముఖ సంస్థ భాగమైన ఈ సినిమాకు మంచి తెలుగు రిలీజే దొరికే అవకాశం వుంది. ఈమధ్య తమిళ సినిమాలకి పేర్లు మార్చడం లేదు. ‘విడాముయర్చి’పేరుతోనే ఈ సినిమాని తెలుగుకి తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొత్తానికి సంక్రాంతికి అజిత్ సినిమా లేదనుకున్న ఫ్యాన్స్ ఇదొక సర్ ప్రైజ్.