`మెహబూబా` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పూరి తనయుడు ఆకాష్. ఆ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేదు. తదుపరి `రొమాంటిక్` సినిమా చేశాడు. అది ఇంకా బయటకు రాలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా పట్టాలెక్కించేశాడు. అదే.. `చోర్ బజార్`. `జార్జ్‌రెడ్డి` దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. వి.ఎన్.రాజు నిర్మాత. ఈరోజే ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ఈనెల 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. యాక్షన్, లవ్, సెంటిమెంట్, వినోదం… ఇవన్నీ ఇందులో పుష్కలంగా జోడించార్ట. క్రైమ్ కామెడీ జోనర్లో సాగే సినిమా ఇది. పోసాని కృష్ణమురళి కీలక పాత్ర పోషిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. కథానాయిక, ఇతర వివరాలు త్వరలో తెలుస్తాయి.