డిసెంబరు 2న అఖండ విడుదల అవుతోంది. శుక్రవారం సెన్సార్ కూడా పూర్తయ్యింది. సినిమా రన్ టైమ్.. 2 గంటల 35 నిమిషాలు. ఫస్టాఫ్ 90 నిమిషాలకు కట్ చేశారు. సెకండాఫ్ మరో 5 నిమిషాలు ఎక్కువ. చివర్లో 5 నిమిషాల మేకింగ్ వీడియో ఒకటి ఉంది. యాడ్స్, టైటిల్ కార్డ్ ఇవన్నీ చూసుకుంటే.. సినిమా 2 గంటల 45 నిమిషాల వరకూ వచ్చిందని టాక్. కొన్ని బీప్స్తో యూ బై ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు.
బోయపాటిది పక్కా కమర్షియల్ స్టైల్. సింహా, లెజెండ్ సినిమాలకు ఫాలో అయిన స్క్రీన్ ప్లే ఫార్మెట్నే అఖండకీ ఫాలో అయ్యాడని తెలుస్తోంది. హీరో, ఇంట్రడక్షన్, తన పోరాటాం.. ఇవన్నీ ఫస్టాఫ్లో చూపించి, సరిగ్గా ఇంట్రవెల్ బ్యాంగ్ కి అఘోరా పాత్రని రంగంలోకి దింపారు. సెకండాఫ్ అంతా.. అఘోరా పాత్రే కీలకం. ఇంట్రవెల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ రెండూ.. భారీ ఎత్తున తీర్చిదిద్దారు. పాటలకు పెద్దగా స్కోప్ లేని సినిమా ఇది. ఐటెమ్ సాంగుల జోలికి కూడా పోలేదు. బాలయ్య పేల్చిన డైలాగులు, శ్రీకాంత్ విలనిజం, యాక్షన్ ఎపిసోడ్స్.. ఈసినిమాకి కీలకం. విజువల్స్ భారీ లెవల్ లో ఉన్నాయని, తమన్ ఆర్.ఆర్.. బాగా ప్లస్ అయ్యిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.