బాలకృష్ణ- బోయపాటి కలయికలో సినిమా అంటే టైటిల్ దగ్గర నుంచే మాస్ అంచనాలు ఏర్పడిపోతాయి. ఇంక టైటిల్ సాంగ్ గురించి చెప్పనక్కర్లేదు. సింహ, లెజెండ్ టైటిల్ సాంగ్స్ అటు పాటగా ఇటు ఆర్ఆర్ గా సూపర్ హిట్స్. ఇప్పుడు వీరి కలయికలో ‘అఖండ’ సినిమా వస్తుంది. కొద్ది సేపటి క్రితమే టైటిల్ సాంగ్ బయటికి వచ్చింది. ‘కం కం కంగుమంది శంఖం’ అంటూ సాగిన ఈ పాటను శంకర్ మహదేవన్ పాడారు. సింహా, లెజెండ్ కి ఏమాత్రం దగ్గకుండా పాటని ట్యూన్ చేశారు.
”వీడెవడో.. హరోం హర : .. వాడెవడో.. హరోం హర : .. ఈ తల తీయ్.. ఆ తల తీయ్ నరుక్కురా నరుక్కురా.. వేళ్ళు విరిచేయ్.. కాళ్ళు విరిచేయ్ హరోం హర : హరోం హర :. కీళ్ళు విరిచేయ్.. తోళ్ళు విరిచేయ్.. నరుక్కురా నరుక్కురా.. ” అంటూ ‘అఖండ ‘ పాత్రని ఎలివేట్ చేస్తూ సాగిన లిరిక్స్ భారీదనం తెచ్చిపెట్టాయి. పాటలో వాడిన శివ తాండవం’ కూడా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేట్లు వుంది. తమన్ మంచి జోష్ లో వున్నాడు. అదే జోష్ పాటలో కనిపించింది. సరిగ్గా బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు టైటిల్ సాంగ్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మాస్ కి నచ్చినట్లు సాహిత్యం రాయడంలో అటు అనంత శ్రీరామ్ కూడా సక్సెస్ అయ్యాడు.