‘మిస్టర్ మజ్ను’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో “ఎన్టీఆర్ నుంచి అఖిల్ యాక్టింగ్, మాస్ నేర్చుకోవాలి. రేయ్… మాస్ నేర్చుకోరా!” అని నాగార్జున పబ్లిక్ గా చెప్పారు. ఈ స్టేట్మెంట్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయింది. తనయుడు అఖిల్ దగ్గర తండ్రి నాగార్జున స్టేట్మెంట్ గురించి ప్రస్తావించగా “మాస్ ఎలా నేర్చుకోవాలో నాన్నను అడగాలి” అని నవ్వేశారు. హీరోగా తన ప్రయాణంలో నాన్న సలహాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అఖిల్ అన్నారు. తను నటించే సినిమా కథలు నాన్న వింటారని అన్నారు. స్క్రిప్ట్ దశలోనూ, ఎడిటింగ్ దశలోనూ, సినిమా పూర్తయిన తర్వాత తప్పకుండా నాన్న సలహాలు తీసుకుంటానని అన్నారు. “మిస్టర్ మజ్నులో ఒక సన్నివేశం విషయంలో నాకు దర్శకుడు వెంకీ అట్లూరి కి చిన్న సందేహం ఉండేది. ఈ సన్నివేశంలో ఈ డైలాగులు కరెక్టేనా కాదా అనుకునే వాళ్ళం. చివరకు నాన్న దగ్గరకు వెళ్ళాం. మేం ఏదైతే ఫీలయ్యామో… నాన్న కూడా అదే చెప్పారు. వెంటనే ఆ సన్నివేశాన్ని రీ షూట్ చేశాం. అర పూట లో ఆ సన్నివేశం పూర్తయింది. సుమారు వంద రోజులు ఓ సినిమాతో ప్రయాణించిన తర్వాత హీరోకి దర్శకుడికి ఆ సినిమాపై ప్రేమ పెరుగుతుంది. కొన్ని విషయాలను సందేహాలుంటే మరొకరి సలహా తీసుకోవడం తప్పులేదు” అని అఖిల్ అక్కినేని అన్నారు.