ఎట్టకేలకు అఖిల్ సినిమా ఒకటి ప్రారంభమైంది. ఆదివారం హైదరాబాద్ లో అఖిల్ చిత్రానికి సైలెంట్ గా క్లాప్ కొట్టేశారు. ఈ చిత్రంతో మురళీ కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీలను కథానాయికగా ఎంచుకొన్నారు
ఈ సినిమాకు ‘లెనిన్’ అనే పేరు పెట్టినట్టు తెలుస్తోంది. లెనిన్ అనగానే రష్యా, కమ్యునిష్ట్ భావజాలం గుర్తొస్తుంది. హిస్టరీ తో పరిచయం ఉన్నవాళ్లెవరైనా లెనిన్ని మర్చిపోరు. అక్టోబరు విప్లవానికి నాంది పలికిన నాయకుడు. అతని వెనుక చాలా కథ ఉంది. అయితే ఆ కథకూ ఈ కథకూ సంబంధం లేదు. కాకపోతే.. ఓ లవ్ స్టోరీని కొత్తగా చెప్పడానికి లెనిన్ అనే పాయింట్‌ని ఈ కథలో వాడుకొన్నాడట దర్శకుడు. ప్రేమ విప్లవం, ప్రేమలో కమ్యునిజం.. ఇలాంటి భావాలతో ఈ కథ సాగుతుందని, హీరో క్యారెక్టరైజేషన్ సైతం కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది. శ్రీలీలతో పాటుగా మరో కథానాయిక కూడా ఈ సినిమాలో కనిపించే ఛాన్సుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
యూవీ క్రియేషన్స్‌లో అఖిల్ ఓ సినిమా చేయాల్సివుంది. అదే ముందుగా పట్టాలెక్కాల్సింది. కానీ బడ్జెట్ పరిమితుల వల్ల ఆ సినిమాకు బ్రేక్ పడింది. ఆ సినిమా ఉంటుందా, లేదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది.