సురేందర్‌కి స్టైలీష్ డైరెక్టర్ అనే పేరుంది. తను యాక్షన్ సీక్వెన్స్‌ని హాలీవుడ్ రేంజ్లో ఆలోచిస్తాడు. ట్విస్టులు, టర్న్‌లతో… సినిమాని ఉరుకులు పరుగులు పెట్టిస్తాడు. ‘ఏజెంట్’ కూడా ఈ జాబితాలోకి చేరిపోతుందన్న నమ్మకం ముందు నుంచీ ఉంది. అఖిల్ ని పూర్తిగా యాక్షన్ మోడ్ లోకి తీసుకెళ్లిపోయిన సినిమా ఇది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే విడుదల కానుంది. ఇప్పుడు టీజర్ వచ్చింది.
1 నిమిషం 17 సెకన్ల టీజర్ ఇది. మమ్ముట్టి డైలాగుతో.. టీజర్ స్టార్ అవుతుంది. మమ్ముట్టి ఇచ్చిన ఎలివేషన్లతో అఖిల్ పాత్రని పరిచయం చేశారు. తనో అండర్ కవర్ ఏజెంట్ అనే సంగతి టీజర్లోనే అర్థమైపోతోంది. ‘టైమ్ ఫర్ వైల్డ్ రైడ్’ అంటూ… మిషన్ గన్నులతో.. రెచ్చిపోయాడు అఖిల్. ముఖ్యంగా.. తన బాడీని బిల్డ్ చేసిన విధానం సూపర్ అనిపిస్తుంది. పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయ్యే సినిమా ఇది. టీజర్ నీ అలానే కట్ చేశారు. అన్నీ హిందీ, ఇంగ్లీష్ డైలాగులే. కాబట్టి.. ఈ టీజర్‌కి భాషతో సంబంధమే లేదు. విజువల్స్ భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం బాగా ఖర్చు పెట్టారన్న సంగతి అర్థమవుతోంది. మొత్తానికి… ఈ సినిమానీ హాలీవుడ్ రేంజ్లో తీయడానికి సురేందర్ రెడ్డి ప్రయత్నించాడన్న విషయం తెలుస్తూనే ఉంది. మరి ఆ ప్రయత్నం ఎంత మేర ఫలించిందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.