అక్కినేని అఖిల్ ఎంగేజ్ మెంట్ జైనాబ్ రౌజీ అనే అమ్మాయితో జరిగినట్లుగా నాగార్డున ప్రకటించారు. ఫోటోలు చూసి చాలా మంది ఎవరో హీరోయిన్ అనుకుని గూగుల్‌లో వెదికారు. సోషల్ మీడియా ఖాతాలు చూశారు. అంతకు ముందు ఏమైనా ఉండేవేమో కానీ.. ఇప్పుడు మొత్తం ఆ ఖాతాల్ని క్లీన్ గా ఉంచారు. ఒక్క వివరం కానీ.. ఫోటో కానీ లేకుండా జాగ్రత్త పడ్డారు.
అయితే గూగుల్‌లో అదే ఇంటిపేరుతో ఉన్న వ్యక్తి జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినట్లుగా బయటపడింది. జగన్ ప్రభుత్వం లో మిడిల్ ఈస్ట్ దేశాలకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జుల్ఫీ రౌజీ అనే వ్యక్తిని నియమించారు. ఆయన నిమ్మగడ్డకు సన్నిహితుడని .. రస్ అల్ ఖైమాతో ఉన్న బాక్సైట్ సమస్యను పరిష్కరిస్తారని నియమించారని అప్పట్లో ప్రచారం జరిగింది. నిజానికి ఆయన పేరు కానీ..ఆయన ఎవరో కానీ ఆంధ్రులకు తెలియదు. ఆయనను అలా నియమించారు. తర్వాత అన్ రాక్ తో సమస్య పరిష్కారానికి ఆయననే జగన్ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది కూడా.
ఇప్పుడు ఆయన కుటుంబసభ్యురాల్నే నాగార్డున కోడలిగా చేసుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. ZR ఇన్ ఫ్రా అనే కంపెనీ రౌజీ కుటుంబీకులకు ఉంది. ఈ జైనాబ్ జగన్ ప్రభుత్వంలో ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించిన జుల్ఫీకి కుమార్తె అవుతారా మరొకటా అన్నది ప్రకటిస్తే తప్ప తెలియదు. ఎందుకంటే.. వారి వ్యాపారాలు ఎక్కువగా గల్ఫ్ లోనే ఉంటాయని చెబుతున్నారు.
నిమ్మగడ్డ ప్రసాద్ తో ఎక్కువ వ్యాపార సంబంధాలు జుల్ఫీ రౌజీకి ఉన్నట్లుగా తెలుస్తోంది. నిమ్మగడ్డకు నాగార్జున మంచి స్నేహితులు. తర్వాత బాక్సైట్ సమస్య పరిష్కారం కోసం ఆయన వీరి టీంలో కలిశారు. అలా బంధువులు అవుతున్నట్లుగా తెలుస్తోంది. అఖిల్‌కు గతంలో జీవీకే కుటుంబంలోని అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది..తర్వాత రద్దు చేసుకున్నారు.