కింగ్ నాగార్జున తను నటించే ప్రతి సినిమానీ బాగా ప్రమోట్ చేసుకుంటాడు. అయితే అవి ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా సినిమా రిలీజ్‌కి వచ్చేసరికి ముమ్మరం చేస్తాడు. అయితే ఈసారి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ కోసం తన ఇంటర్వ్యూ విషయాన్ని పక్కనపెట్టి టి.వి. ఛానల్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన వీడియోస్‌ను లెక్కకు మించి విడుదల చేయడం ద్వారా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు.
ఇదిలా వుంటే పూర్తి పండగ వాతావరణంతో కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇప్పటివరకు రిలీజ్ చేసిన ట్రైలర్స్ ద్వారా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఎస్టాబ్లిష్ అయింది. దాన్ని ప్రమోషన్లో కూడా కంటిన్యూ చెయ్యాలన్న ఉద్దేశంతో కింగ్ నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్‌ని కూడా రంగంలోకి దించాడు నాగార్జున. ఈ చిత్రంలో బంగార్రాజు క్యారెక్టర్ చేసిన నాగార్జున పూర్తి పంచెకట్టుతో కనిపిస్తాడు. నాగచైతన్య, అఖిల్ కూడా ఈరోజు పంచెకట్టుతో సినిమా ప్రమోషన్లో దర్శనమిచ్చారు. సినిమా టైటిల్‌కి తగ్గట్టు, తండ్రి క్యారెక్టర్‌కి తగ్గట్టు, అతని గెటప్‌కి తగ్గట్టు కొడుకులు కూడా అవే గెటప్స్ వేసుకొని సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. తండ్రి సినిమా కోసం కొడుకులు కూడా రంగంలోకి దిగడంతో ఈ సినిమా ప్రేక్షకుల్ని రీచ్ అవ్వడం, వారిని ఎట్రాక్ట్ చెయ్యడం పెద్ద కష్టమేమీ కాదేమో!