తొలి సినిమా ఫ్లాప్ అవ్వడం అఖిల్‌కి మంచే చేసింది. చిత్రసీమలో నిలదొక్కుకోవడం, ప్రేక్షకుల్ని ఆకర్షించడం, వాళ్ల నమ్మకాన్ని పొందడం అంత తేలిక కాదన్న విషయాన్ని తొలి సినిమానే చెప్పేసింది. అందుకే… తన రెండో సినిమా ‘హలో’ కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు అఖిల్.
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్లిన అఖిల్.. అక్కడ ధూమ్ ధామ్ చేసేశాడు. స్టేజీపై పాడాడు, ఆడాడు, వయోలిన్ వాయించాడు. ‘అరె… అఖిల్‌లో ఇంత టాలెంట్ ఉందా?’ అని అక్కడి వాళ్లంతా ఆశ్చర్యపోయేలా చేశాడు.
నిజానికి అఖిల్ ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. విక్రమ్ కె.కుమార్‌కి అమెరికాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడి ప్రేక్షకుల టేస్ట్‌కి.. విక్రమ్ సినిమాలు అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. అఖిల్ సినిమా ఓపెనింగ్స్‌కి ఎలాంటి ఢోకా లేదు. కానీ.. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదన్న ఉద్దేశంతో.. అమెరికా ప్రమోషన్స్‌పై గట్టిగా దృష్టి పెట్టాడు అఖిల్. విశాఖ పట్నంలో ఆడియో ఫంక్షన్‌కి కూడా ప్రత్యేకంగా ప్రిపేర్ అయి వెళ్లాడు. అక్కడా పాడాడు. డాన్స్ చేశాడు. ఇప్పుడు పోగ్రాం హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. ఈనెల 20న హైదరాబాద్‌లో ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని చిత్రబృందం డిసైడ్ అయ్యింది. హైదరాబాద్‌లో కూడా అఖిల్ లైవ్ పెర్‌ఫార్మ్సెన్స్ ఇవ్వబోతున్నాడు. ఇక్కడి వాళ్లనీ జోష్‌లో ముంచేయబోతున్నాడు. మొత్తానికి ‘నాని’ సినిమాకి ధీటుగానే అఖిల్ ప్రమోషన్లు సాగుతున్నాయి. ఈ కష్టానికి ఎలాంటి ప్రతిఫలం వస్తుందో చూడాలి.