‘సామజవరగమన’తో రచయితగా పేరు తెచ్చుకొన్నారు నందు. ఆయన దర్శకుడిగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆమధ్య వెంకటేష్‌ని కలిసి ఓ కథ చెప్పారు. వెంకి కూడా కూడా బాగా నచ్చింది. సినిమా ఓకే అనుకొన్నారంతా. అయితే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వెంకీ డైలామాలో పడ్డారు. ఈ హిట్ ని కాపాడుకోవాలంటే మంచి కాంబినేషన్‌తో సినిమా చేయాలని ఫిక్సయ్యారు. ‘నీ కథ బాగుంది. వేరే దర్శకుడితో ప్రొసీడ్ అవ్వొచ్చా’ అని అడిగితే నందు ఒప్పుకోలేదని తెలుస్తోంది. దాంతో వెంకీ – నందుల సినిమా ఆగిపోయింది.
ఇప్పుడు నందు.. అఖిల్‌కి ఓ కథ చెప్పినట్టు తెలుస్తోంది. అఖిల్ కూడా ఈ సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు టాలీవుడ్ టాక్. అయితే వెంకీకి చెప్పిన కథ ఇది కాదు. అది వేరు, ఇది వేరు. ప్రస్తుతం అఖిల్ `లెనిన్` అనే ఓ సినిమా చేస్తున్నాడు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఆ తరవాత నందు సినిమా మొదలయ్యే ఛాన్సుంది. అఖిల్ – నందు సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. నందు ప్రస్తుతం స్క్రిప్టు పనులు మొదలెట్టినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.