అఖిల్ రెండో సినిమా పట్టాలెక్కింది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆదివారం సాయంతరం 6 గంటల 17 నిమిషాల శుభ ముహూర్తాన అక్కినేని కుటుంభ సభ్యుల సమక్షంలో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు. అక్కినేని ముని మనవరాళ్ళు సత్య సాగరి దేవుని పటాలపై క్లాప్ ని ఇవ్వగా , దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ, ” ‘మనం’ టెక్నికల్ టీం వర్క్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా మరో ట్రెండ్ సెట్టర్ అవుతుంది.” ఏప్రిల్ 3 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందన్నారు.
విక్రమ్ కె కుమార్ చెబుతూ ” అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ‘మనం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మళ్ళీ అదే బ్యానర్ లో ఒక మంచి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అఖిల్ కి ఇది ఒక డిఫరెంట్ కమర్షియల్ ఫిలిం అవుతుంది ” అన్నారు ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ : పి.ఎస్. వినోద్, ఆర్ట్ : రాజీవన్ , ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, నిర్మాత : అక్కినేని నాగార్జున, రచన, దర్శకత్వం : విక్రమ్ కె కుమార్.