సుకుమార్ కథతో అఖిల్ ఓ సినిమా చేయబోతున్నాడని ఆమధ్య ఓ వార్త బయటకు వచ్చింది. ఆ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది ఇప్పుడు తేలిపోయింది. కుమారి 21 ఎఫ్‌తో ఆకట్టుకున్న సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కుమారి 21 టీమ్ ఈ సినిమాకి పనిచేస్తారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే బాధ్యత సుకుమార్ చూసుకుంటారు. దేవిశ్రీ సంగీతం అందిస్తారు. రత్నవేలు కెమెరామెన్‌గా పనిచేస్తారు. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, అన్నపూర్ణ స్డూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తాయి. నిజానికి ఈ ప్రాజెక్టు రాజ్ తరుణ్‌తో సెట్ కావాల్సింది. రాజ్ తరుణ్ వరుస వైఫల్యాలలో కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకే ఆ ఛాన్స్కాస్త జారి అఖిల్ చేతిలో పడింది. అయితే రాజ్‌తరుణ్ కోసం అనుకున్న కథ వేరని, అఖిల్ కోసం సుకుమార్ కొత్త కథ రాశాడని సమాచారం. ప్రస్తుతం తన మూడో సినిమా బిజీలో ఉన్నాడు అఖిల్. అది పూర్తయ్యాకే ఈ ప్రాజెక్టు గురించి తెలుస్తుంది.