అక్కినేని మూడోతరం వారసుడిగా అఖిల్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ‘అఖిల్’ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయినా అఖిల్ కు మాత్రం మంచి క్రేజ్ తీసుకువచ్చింది. అయితే అఖిల్ రెండో సినిమా దర్శకుడు ఎవరు..? అఖిల్ ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడు..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. అయితే మొదటి సినిమాలో జరిగిన తప్పులను రెండో సినిమాకు రిపీట్ అవకుండా జాగ్రత్తపడుతున్నాడు నాగార్జున.
అందుకే తనయుడి రెండో సినిమా దర్శకుడిని వెతికే పనిలో నిమగ్నమయ్యాడు. నాగార్జునకు సోగ్గాడు లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అఖిల్ సినిమా ఉంటుంది అంటే కాదు కాదు ఊపిరి దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అఖిల్ సినిమా అంటూ మళ్లీ మీడియా రచ్చ చేయడం మొదలు పెట్టింది. అయితే ఈ కన్ ఫ్యూజన్ కు ఓ క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. ప్రస్తుతం మార్చ్ 25న రిలీజ్ అవుతున్న ఊపిరి ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న నాగ్ అఖిల్ వంశీ సినిమా చర్చల దశలో ఉందంటూ ఓ క్లూ ఇచ్చాడు.
సో మొత్తానికి నాగ్ సినిమా చేస్తూ అఖిల్ ఆఫర్ ను పట్టేశాడు వంశీ పైడిపల్లి. మొదటి సినిమా మున్నా తప్పించి మిగతా సినిమాలన్ను సేఫ్ జోన్ లో తీసుకు వెళ్తున్న వంశీ నిర్మాతల దర్శకుడు అనే నమ్మకం ఉంది. మరి మొదటి సినిమాలో నెరవేరని అఖిల్ కోరికలన్ని ఈ సినిమాతో తీర్చుకుంటాడనే నమ్ముతున్నారు అక్కినేని అభిమానులు.