అక్కినేని అఖిల్ తెరంగేట్రం చేస్తున్న సినిమా అఖిల్ సినిమా అఫిషియల్ గా అయితే ఈ నెల 21న రిలీజ్ అని అంటున్నారు. కాని ఓ ఆంగ్ల దినపత్రిక కథనాల ప్రకారం అఖిల్ సినిమా పోస్ట్ పోన్ అవ్వబోతుందని జ్యోతీష్యం చెబుతున్నారు. రేపు గుణశేఖర్ రుద్రమదేవి గ్రాండ్ గా రిలీజ్ అవుతుండగా.. 16న బ్రూస్ లీ పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న బ్రూస్ లీ సినిమా రిజల్ట్ మీద అఖిల్ సినిమా రిలీజ్ డిపెండ్ అవుతుందట.
ఒకవేళ బ్రూస్ లీ సినిమా భారీ రేంజ్లో హిట్ అయితే అఖిల్ సినిమా కచ్చితంగా వాయిదా పడటం ఖాయమని తెలుస్తుంది. కాని చిత్ర యూనిట్ మాత్రం ఈ వాదనలను తోసి పుచ్చుతుంది. బ్రూస్ లీతో సంబంధం లేకుండా అఖిల్ సినిమా కచ్చితంగా అనుకున్న టైంకే రిలీజ్ అవుతుందని అంటున్నారు దర్శక నిర్మాతలు. ఇది మొదటనుండి అనుకుంటూ ఉన్నదే కాని బ్రూస్ లీ, రుద్రమదేవి సినిమాలు ఊహించని విజయం అందుకుంటే అఖిల్ సినిమాపై దెబ్బ పడే ఛాన్స్ ఉంది.
మరి అఖిల్ సినిమా వస్తుందా రాదా అన్నది బ్రూస్ లీ రిజల్ట్ మీద ఆధారపడి ఉందన్న మాట. ఒకవేళ అఖిల్ నిజంగానే పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి వస్తే ఇక నవంబర్లో మంచి ముహుర్తం చూసి వదులుతారు.