అఖిల్ రెండో సినిమాపై ఎన్ని రూమర్లో. బాలీవుడ్ సినిమాని రీమేక్ చేస్తున్నారని కొన్ని రోజుల పాటు ప్రచారం జరిగింది. ఈ సినిమా నుంచి ఓ ప్రొడక్షన్ హౌస్ తప్పుకొందని ఇంకొన్ని రోజులు ప్రచారం సాగింది. ఇప్పుడు వంశీపైడి పల్లి ఈ సినిమాఉనంచి డ్రాప్ అయ్యాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిపై అఖిల్ స్పందించాడు. వార్తలు రాసేముందు నన్నుగానీ, నా మేనేజర్ని గానీ సంప్రదించండి, ఇలాంటి తప్పుడు న్యూస్లు రాసి నన్నూ బాధపెట్టి, మీ విశ్వసనీయతకు భంగం కలిగించొద్దు అంటూ రిస్వెస్ట్ చేస్తున్నాడు అఖిల్.
‘ప్రింట్, ఆన్లైన్ మీడియాకు చెందిన నా ప్రియమైన స్నేహితులారా.. నాకు మేనేజర్, పీఆర్ టీమ్ ఉన్నారు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దయచేసి వారికి స్వేచ్ఛగా ఫోన్ చేయండి, లేదా కలవండి… కానీ ధృవీకరించుకోకుండా వార్తలు రాయడం వల్ల నష్టం జరగడమే కాదు.. మీ విశ్వసనీయత కూడా దెబ్బ తింటుంది.. వంశీ, నేను కలిసి పనిచేయడానికి ఇష్టపడతాం. ఏ చిత్రం గురించీ నేను అధికారికంగా ప్రకటించలేదు. సరైన కథ దొరికినప్పుడు నా చిత్రం గురించి ప్రకటిస్తాను’ అని అఖిల్ ట్వీట్ చేశారు.