సెలబ్రెటీలు ఓ మాట మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్లేం మాట్లాడినా రికార్డ్ అయిపోతుంది. చరిత్రలో మిగిలిపోతుంది. మరోసారి దానికి విరుద్ధమైన స్టేట్మెంట్ ఇస్తే మాత్రం అడ్డంగా దొరికిపోతారు. ఇప్పుడు అఖిల్ దొరికినట్టు.
మిస్టర్ మజ్ను అఖిల్ మూడో సినిమా. ఇది వరకు చేసిన రెండు సినిమాలూ ఫ్లాప్ అయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో.. కాన్ఫిడెంట్ గా కనిపించడం, నమ్మకంగా మాట్లాడడం చాలా కష్టం. కానీ అఖిల్ మాత్రం చాలా ధీమాగా కనిపిస్తున్నాడు. ”ఇదే నా మొదటి సినిమా అనుకుంటున్నాను. పాత ఫ్లాపుల్ని మర్చిపోయి పనిచేశాను. అందుకే ఈ సినిమాపై నమ్మకం పెరిగింది” అంటున్నాడు అఖిల్. తన ఫ్లాపుల్ని మర్చిపోవాలనుకోవడం, కొత్తగా ప్రయాణం చేయాలనుకోవడం నిజంగా మెచ్చుకోదగిన విషయాలే.
కాకపోతే ‘హలో’ విడుదల సమయంలోనూ అచ్చంగా ఇలాంటి స్టేట్మెంట్లే ఇచ్చాడు. ”ఇది నా డెబ్యూ మూవీలా ఉంది. అఖిల్ సినిమా పరాజయం మర్చిపోయి పనిచేశా” అని ఆ సినిమా ఇంటర్వ్యూలలో, ప్రెస్ మీట్లలో చెప్పుకొచ్చాడు. స్వయంగా నాగార్జున సైతం ”అఖిల్ ని రీలాంచ్ చేస్తున్నట్టు ఉంది” అన్నాడు. కానీ ఏమైంది..? అఖిల్ లానే హలో కూడా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు కూడా సేమ్ టూ సేమ్ అదే మాట చెబితే ఎలా?? కొత్త మాటలు వెదుక్కో అఖిల్..!