రాంగోపాల్ వర్మ భలేంటి ఆఫర్లు పట్టేస్తాడు. అతన్ని ఇక ఎవరూ నమ్మరు అనుకుంటున్నప్పుడు ఓ షాకింగ్ కాంబోతో తెరపైకి వస్తాడు. `శివ` కాంబోని మళ్లీ సెట్ చేయగలిగాడంటే అదంతా వర్మ తాలుకూ తెలివితేటలే. ఆ సినిమా ఇప్పుడు సెట్స్‌పై ఉంది. ఈలోగా అఖిల్ కోసం కూడా వర్మ ఓ కథ సిద్ధం చేస్తున్నాడన్న టాక్స్ వినిపిస్తున్నాయి. అఖిల్‌తో వర్మ సినిమా ఉండబోతోందని టాలీవుడ్ కోడై కూస్తోంది. ఈమధ్యే అఖిల్‌పై వర్మ ఓ ట్రైల్ షూట్ చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే… అసలు విషయం ఏమిటంటే… అది ట్రైల్ షూట్ కాదు. ఓ షార్ట్ ఫిల్మ్. అవును.. అఖిల్ ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించాడు. దానికి వర్మ దర్శకత్వం వహించాడు. ఆ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ వినూత్నంగా ఉండబోతోందట. పరిస్థితుల్ని బట్టి దాన్ని వదలాలా, లేదా అనేది ఆలోచిస్తారట. తరచూ వర్మ – నాగ్ సినిమా షూటింగ్ చూడ్డానికి వెళ్తున్నాడు అఖిల్. అక్కడ మాటల సందర్భంలో వర్మ ఓ కాన్సెప్ట్ చెప్పడం, దాన్ని షార్ట్ ఫిల్మ్‌గా చేయడానికి అఖిల్ ఒప్పుకోవడంతో… ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. అంతే గానీ… ఇదేం సినిమాకాదు. జస్ట్.. ట్రైల్ వేశారంతే! మరి ఆ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ ఏమిటో, ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.