మొదటి సినిమాతో మాంచి మాస్ హీరోగా ఎదగాలని అక్కినేని అఖిల్ ఆరాటపడ్డాడు. త్రివిక్రమ్, కొరటాల, విక్రమ్ కుమార్ వంటి టాప్ క్లాస్ దర్శకులతో హీరోగా కుమారుడిని ఇంట్రడ్యూస్ చేయాలని నాగార్జున భావించినా… అఖిల్ ఏరికోరి వినాయక్‌ను సెలెక్ట్ చేసుకుని ‘అఖిల్’ చేశాడు. ఊహించని రీతిలో ‘అఖిల్’ ఘోరమైన ప్లాప్‌గా రికార్డులకు ఎక్కింది. ఆ ప్రభావం నుంచి బయటపడడానికి చాలారోజుల టైమ్ పట్టింది. తర్వాత తండ్రి సలహా మేరకు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘హలో’ చేశాడు. అందులోనూ యాక్షన్ సీన్లు విభిన్నంగా వుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అదీ ఆశించిన హిట్ ఇవ్వలేదు. దాంతో అఖిల్‌లో మరింత మార్పు వచ్చిందట. తొలి రెండు సినిమాలు అందించిన అనుభవంతో ఈసారి పక్కా ప్రేమకథ చేయాలని డిసైడ్ అయ్యాడట. ‘తొలిప్రేమ’తో ఒక్కసారిగా ఇటు ఇండస్ట్రీ ప్రముఖులు, అటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన వెంకి అట్లూరి దర్శకత్వంలో అఖిల్ చేయబోయేది ప్యూర్ లవ్ స్టోరీ అని టాక్. అఖిల్, వెంకి అట్లూరి సినిమాను ‘తొలిప్రేమ’ నిర్మించిన బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించనున్నారు. త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్సుంది.