తన రెండో సినిమా విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు అఖిల్. ఇప్పటి వరకూ దాదాపు 20కథలు విన్న అఖిల్‌ని ఏకథా సంతృప్తి పరచలేదు. చివరికి హను రాఘవపూడి చెప్పిన కథని ఓకే చేశాడు. ఈ కథ అఖిల్‌కి బాగా నచ్చినప్పటికీ.. నాగ్ కొన్ని విషయాల్లో డౌట్లు వ్యక్తం చేశాడట. నాగ్ని ఒప్పిస్తే గానీ.. ఈ సినిమా పట్టాలెక్కదు. అందుకే నాగ్ సూచించిన మార్పులు చేర్పులతో హను రాఘవపూడి మళ్లీ పూర్తి స్థాయిలో స్క్రిప్టు సిద్ధం చేసుకొని వెళ్లాడట. ఈసారి నాగ్‌కి హను కథ బాగా నచ్చిందని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది.
అంతేకాదు… ఈసినిమా మేకింగ్‌లో కూడా కావల్సినంత సమయం తీసుకోమని, దేనికీ కంగారు పడొద్దని నాగ్ సూచించాడట. ఓ దర్శకుడికి కావల్సినంత టైమ్ ఇస్తే.. పండగే కదా. అందుకే ఈ ప్రాజెక్టు విషయమై హను రాఘవపూడి కూడా ఫుల్లుగా హ్యాపీగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆగస్టు తొలి వారంలో అఖిల్ రెండో సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.