టాలీవుడ్‌కి మరో షాకింగ్ వార్త ఇది. అఖిల్ – శ్రియ రెడ్డిల నిశ్చితార్థం ఎంత సడన్ సర్ ప్రైజ్ ఇచ్చిందో.. వాళ్లిద్దరి బంధం.. ఇప్పుడు బీటలు వారబోతోంది అన్నదీ అంతే షాకింగ్ గా మారింది. అఖిల్ – శ్రియాల నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యిందన్నది టాలీవుడ్లో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్‌లోని అతిరథమహారథుల్ని పిలిచి గ్రాండ్‌గా నిశ్చితార్థం చేశారు.. యూరప్ లో పెళ్లి అన్నారు.. ఆల్రెడీ టికెట్లు కూడా బుక్ అయిపోయాయి.. ఇంతలోనే ఏమైందబ్బా?? అంటూ చెవులు కొరికేసుకొంటోంది టాలీవుడ్.
కాస్త లోతుగా వెళ్తే.. కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు తెలిసొచ్చాయి. అఖిల్ – శ్రియల పెళ్లి నాగార్జున ఇంట్లో వాళ్లకు పూర్తిగా సమ్మతమేనట. అయితే… జీవీకే ఫ్యామిలీ మాత్రం కాస్త ముందు నుంచీ… అభ్యంతరం చెబుతూనే ఉన్నట్టు సమాచారం. అంతే కాదు.. అఖిల్ ఇంకా లైఫ్‌లో సెటిల్ అవ్వలేదని, అతని కెరీర్ ఇప్పుడే మొదలైందని, అప్పుడే పెళ్లికి తొందరేంటని వారిస్తూ వచ్చారట. కానీ అఖిల్ – శ్రియలు తొందరపడుతుండడంతో.. ఇష్టం లేకపోయినా పెళ్లికి ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. నిజానికి నిశ్చితార్థమంటూ హడావుడి చేయడం అటు అక్కినేని కుటుంబానికీ, ఇటు జీవీకే ఫ్యామిలీకీ ఏమాత్రం ఇష్టం లేదట. అఖిల్ – శ్రియాలే నిశ్చితార్థం డేటు ఫిక్స్ చేసుకొని. ఆ రోజున నిశ్చితార్థం చేయాల్సిందే అని పట్టుపట్టారట. ఇలా తెర ముందు జరుగుతున్న వ్యవహారం మొత్తం జీవీకే ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా.. కామ్‌గా ఉన్నార్ట. అయితే.. ఇటీవల జీవీకే ఫ్యామిలీకి అక్కినేని కుటుంబానికీ మధ్య ఉన్న కమ్యునికేషన్ గ్యాప్ బాగా పెరిగిపోయిందని, ఇక ఈ బంధం.. ముందుకు వెళ్తుందన్న నమ్మకం రెండు కుటుంబాలకూ లేకపోవడం వల్ల, పరస్పరం మాట్లాడుకొని పెళ్లి ఆపేద్దామన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆగస్టులో యూరప్ ప్రయాణానికి తీసుకొన్న టికెట్లు క్యాన్సిల్ చేసుకోవడం వల్ల.. ఈ విషయం రూఢీ అయిపోయింది. అయితే నాగార్జున మాత్రం అఖిల్ కోసం చివరి నిమిషం వరకూ విశ్వ ప్రయత్నాలు చేశారని, ఇంత వరకూ వచ్చాక.. పెళ్లి ఆగిపోతే బాగోదని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడట. కానీ.. జీవీకే ఫ్యామిలీ ఏమాత్రం మెత్తబడలేదని తెలుస్తోంది. అటు శ్రియకీ, ఇటు అఖిల్‌కీ ఈ పెళ్లి ఇష్టమే. కానీ… శ్రియా ఇంట్లో పెద్దలే అడ్గుతగులుతున్నారన్నది అక్కినేని కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న మాట. నిజానిజాలేంటన్నది కాలమే చెప్పాలి.