జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఏమాయ చేసావేతో లవర్ బోయ్ ఇమేజ్ సంపాధించాడు నాగచైతన్య. ప్రస్తుతం కెరియర్ లో హిట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న చైతన్య ఆ ప్రయత్నంలోనే బాగా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ కు రెడీ అవుతుండగా.. మరో వైపు మజ్ఞు సినిమా కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. మలయాళం ప్రేమం రీమేక్ గా వస్తున్నమజ్ఞు సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారు అందరు.
ఇక ఈ రెండు సినిమాల తర్వాత నాగచైతన్య ఎవరు ఊహించని విధంగా ఓ కమర్షియల్ దర్శకుడి డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడని టాక్. లక్ష్యం, లౌఖ్యం సినిమాలతో గుర్తింపు తెచ్చుకుని రీసెంట్ గా బాలయ్య డిక్టేటర్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు శ్రీవాస్ నాగచైతన్య చేయబోయే తర్వాత సినిమాను డైరెక్ట్ చేయనున్నాడట. ఓ పక్క లవర్ బోయ్ ఇమేజ్ ఉన్నా చైతన్య, తనకు కూడా ఓ కమర్షియల్ ఇమేజ్ రావాలని అంతకుముందు దడ, తఢాకా అంటూ ప్రయోగాలు చేశాడు.
అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్ని సాఫ్ట్ లవ్ స్టోరీస్ కాబట్టి రాబోయే రెండు సినిమాల తర్వాత శ్రీవాస్ తో ఓ మాంచి మాస్ మసాలా సినిమా ఉంటుందని తెలుస్తుంది. మరి కమర్షియల్ ఇమేజ్ కోసం తహతహ లాడుతున్న నాగచైతన్యకు ఆ సినిమా అయినా కమర్షియల్ సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.