కొంతకాలం నుంచి నాగచైతన్య – సమంతల వ్యవహారం టాలీవుడ్లో నలుగుతూనే ఉంది. వీరిద్దరిపై ఏవేవో కథనాలు వస్తున్నాయి. సమంత ఎప్పుడైతే పెళ్లిమేటర్ తీసుకొచ్చిందో.. అప్పుడే డొంక కదిలింది. సమంత మనసులో ఉన్నది నాగచైతన్యే అని అర్థమైంది. నాగార్జున కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. కథ కి శుభం కార్డు పడబోతోంది అనిపించింది. అయితే ఇప్పుడే సరికొత్త ట్విస్ట్ వచ్చింది. సమంత విషయంలో నాగచైతన్య నిర్ణయం మార్చడానికి శతవిధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. చైతూకి బ్రెయిన్ వాష్ చేయడం మొదలెట్టారట. ‘సమంత ని చేసుకోవడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు’ అంటూ చైతూకి పూస గుచ్చినట్టు వివరిస్తున్నట్టు టాక్. అందుకే ఈ విషయంలో చైతూ… పునరాలోచనలో పడ్డాడని తెలుస్తోంది.
నిజానికి సమంత తన లవ్ మేటర్ బయట పట్టిన కొన్ని రోజులకు చైతూ కూడా ఓపెన్ అయిపోదామనుకొన్నాడు. తన ఇంటి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఆగస్టు లో నిశ్చితార్థం చేసుకొందామనుకొన్నాడట. అయితే.. ఇప్పుడు చైతూ నుంచి ఎలాంటి కదలికలూ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. కనీసం చైతూ ఇప్పటి వరకూ.. ఈ విషయంలో నోరు జారలేదు. మీడియా హడావుడి తప్ప.. చైతూ తనంతట తాను బయటపడలేదు. సురేష్ బాబు, రానా… ఇలా చైతన్యకు బాగా కావాల్సినవాళ్లంతా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు.. ఈ విషయంలో ఏమాత్రం తొందరపడకూడదని చైతూ నిర్ణయం తీసుకొన్నట్టు టాక్. సిద్దార్థ్ సమంతకు హ్యాండిచ్చినట్టే.. ఒక వేళ చైతూ కూడా హ్యాండిస్తే ఆశ్చర్యపోనవసరం లేదన్నమాట. ఈ లవ్ స్టోరీ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.