‘నా సామిరంగ’తో ఓ హిట్టు కొట్టారు నాగార్జున. ఇదే జోష్‌తో కొత్త కథలు వింటున్నారు. ‘నా సామిరంగ’ కంటే ముందే తమిళ దర్శకుడు నవీన్ చెప్పిన కథకు నాగ్ ఓకే చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కథ ఓ మల్టీస్టారర్ రూపం సంతరించుకొంది. మరో పాత్ర కోసం అక్షయ్‌కుమార్ పేరు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అక్షయ్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. అక్షయ్ గనుక ఒప్పుకొంటే నాగ్ ఖాతాలో ఓ పాన్ ఇండియా సినిమా చేరిపోయినట్టే. నాగ్ కి బాలీవుడ్ లో మంచి గుర్తింపే ఉంది. ఇటీవల ‘బ్రహ్మాస్త్ర’లో ఆయన ఓ కీలక పాత్ర పోషించారు. అక్షయ్ సినిమాలకు సౌత్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో.. ఇద్దరూ కలిస్తే పాన్ ఇండియా పరంగా ఈ సినిమాకి ఓ క్రేజ్ వస్తుంది. ఇదో యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. బహుశా అక్షయ్ నెగిటీవ్ లక్షణాలున్న పాత్ర పోషించే ఛాన్సుంది. అయితే ప్రస్తుతం అక్షయ్ పేరు చర్చల దశలోనే ఉంది. తను గనుక ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇస్తే.. ఈ సినిమా రూపు రేఖలు సమూలంగా మారిపోతాయి. నాగ్ వందో సినిమాగా దీన్నే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ రానుంది.