దేన్నైనా తట్టుకోవచ్చు కానీ ఆకలిని తట్టుకోలేరు. అందుకే ఆకలిని తీర్చేవారిని దేవుళ్లంటారు. అలాంటి దేవుళ్లే అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్వాహకులు. అక్షయ పాత్ర ద్వారా రోజూ కొన్ని లక్షల మంది ఆకలి తీరుస్తున్నారు. విజయవాడ వరదల్లో కొన్ని లక్షల మంది ఆకలి దప్పుల నుంచి కాపాడింది ఈ అక్షయపాత్రే.
హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ నేతృతవంలో ఈ అక్షయపాత్ర నడుస్తుంది. ఎంతో సేవా భావంతో చేసే ఈ సేవ విపత్తుల సమయంలో దైవకార్యమే అవుతుంది. విజయవాడ వరదల సమయంలో పదిన్నర లక్షల మందికి సరిపడా భోజనాలను సరఫరా చేసింది. ప్రతి ఇంటికి ఆహార పొట్లాలు చేరాయంటే.. అది అక్షయపాత్ర చేసిన కృషే. మధ్యాహ్న భోజన పథకం కోసం మూడు వందలకుపైగా పాఠశాలలకు భోజనం సరఫరా చేస్తుంది. అలాగే అన్న క్యాంటీన్లకు ఆహార సరఫరా బాధ్యతను కూడా అక్షయపాత్రకే ఇచ్చారు.
తాడేపల్లిలో ఓ భారీ అక్షయపాత్ర కిచెన ను కూడా నిర్మించారు. యంత్రాల సాయంతో చకచకా వంట చేసి.. ఆపన్నుల కోం పంపుతుంది. సాంబార్ రైస్, పొంగలి, టామాటా బాత్, టమాటా రైస్ వంటివి తయారు చేసేస్తున్నారు. ఈ అక్షయ పాత్ర సేవలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. హైదరాబాద్లో అతి పెద్ద కిచెన్ ఉంది. అన్నపూర్ణ క్యాంటీన్లకు.. సరఫరా చేసేది అక్షయపాత్రనే. ఏ మాత్రం లాభాపేక్ష లేకుండా… స్వచ్చందంగా ఇచ్చే విరాళాలు తప్ప .. పెద్దగా ప్రచారం కూడా చేసుకోదు అక్షయపాత్ర ఫౌండేషన్.
నిజంగా ఆకలితో ఉన్నవాడి ఆకలి తీర్చడమే పరమాత్మకు సేవ అని గట్టిగా నమ్ముతారు మానవత్వం ఉన్నవారు. అక్షయపాత్ర అలాంటి మానవత్వం మూర్తిభవించిన ఫౌండేషన్.