త్రివిక్రమ్ ప్రజంటేషన్ బాగుంటుంది. సినిమా తీసినా యాడ్ చేసినా… దాని లెక్కే వేరు. ఈసారి ఆయన ఫోకస్ ప్రమోషన్స్ పై పెట్టారు. బేసిగ్గా సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎక్కువ తల దూర్చరు త్రివిక్రమ్. ఆడియో ఫంక్షన్.. ఓ నాలుగు ఇంటర్వ్యూ లు అంతే. కానీ ‘అల వైకుంఠపురంలో’ విషయానికి వచ్చేసరికి .. కొత్త గేర్ వేశారు. మ్యూజిక్ తో కొట్టారు. మాములుగా కాదు. సామజవరగమన, రాముల.. ఈ రెండు పాటలు యూట్యూబ్ ని అల్లడించేస్తున్నాయి. గంటల్లో మిలియన్ల వ్యూస్. ఆ పాటల బీట్ కి పిల్లలు కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా వుందంటే.. ఇంక ఎలాంటి హడావిడి లేకుండా డైరెక్ట్ గా సినిమాని థియేటర్ లోకి వదిలేసిన.. టికెట్లు తెగిపోతాయి. ఆ రేంజ్ పబ్లిసిటీ వచ్చేసింది అల వైకుంఠపురంకి.
ఇదంతా ఓవర్ నైట్ లో జరిగిపోలేదు. దీని వెనుక త్రివిక్రమ్ , నిర్మాతల పక్కా ప్లాన్ వుంది. బాగా గమనిస్తే.. పాటలని తీసుకొని కవర్స్ షూట్ చేశారు. తమన్ ఆర్కెస్ట్రా టీంపై స్పెషల్ షూటింగులు చేసి .. ఎడిటింగ్ షూట్ లు కేటాయించి.. దానికోసం స్పెషల్ బడ్జెట్ ఇచ్చి.. ఆ రెండు పాటలని ట్రెండీగా మలిచి వదిలారు. ఇప్పుడవి ట్రెండింగ్ లో కూర్చున్నాయి.
అయితే ఈ వ్యవహరం మొత్తం మహేష్ బాబు ‘సరిలేరు నికెవ్వరు’ టీంకి ఛాలెంజ్ గా మారింది. ఈ రెండు సినిమాలు కూడా పండక్కి వస్తున్నాయి. ఇంకా వాళ్ళు ఎలాంటి యాక్టివిటీ మొదలుపెట్టలేదు. అయితే అల వైకుంఠపురం పాటల వైరల్ సంగతి మహేష్ దృష్టికి వెళ్ళింది. ”ప్రమోషన్స్ ని మనమూ క్రియేటివ్ గా చేద్దాం” అని నిర్మాతలతో మహేష్ కాస్త సీరియస్ గా చెప్పినట్లు ఇన్ సైడ్ వర్గాల టాక్.
ఇప్పుడు అదే పనిపై కొంతమంది క్రియేటివ్ హెడ్స్ తో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారని తెలిసింది. అల వైకుంఠపురం లా కవర్స్ చేసి రిలీజ్ చేస్తే మళ్ళీ కంపెరిజన్స్ వస్తాయి. నిజానికి ఇలా పాటల విడుదలకు ముందే కవర్స్ చేయడం కొత్త ధాట్ ఏమీ కాదు. రెహ్మాన్ లాంటి సంగీత దర్శకులు ఈ ఫార్ములని ఎప్పుడో వాడేశారు. కానీ టాలీవుడ్ విషయానికి వచ్చేసరికి కొంచెం కొత్తగా వర్క్ అవుట్ అయ్యింది. ఇప్పుడు మహేష్ టీం కూడా అదే చేస్తే.. పోలికలు, కాపీలనే కామెంట్లు వస్తాయి. సో వీడియో కవర్స్ ఆలోచనని పక్కన పెట్టేసే ఛాన్స్ వుంది.
దేవిశ్రీ ప్రసాద్ లైవ్ షో ఇవ్వడంలో దిట్ట. దేవితో ఓ లైవ్ షో ప్లాన్ చేసి.. ఒక్కో టౌన్ లో ఒక్కో పాట రిలీజ్ చేయాలనే ఆలోచన కూడ చేస్తున్నారు. చూడాలి.. మహేష్ టీం ఎలాంటి క్రియేటివ్ ఐడియాస్ తో ముందుకు వస్తుందో మరి.