టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హఠాత్తుగా ఆయన ఇంటికి వచ్చిన పది మంది పోలీసులు … కారణం చెప్పకుండానే తమ వెంట తీసుకెళ్లారు. అయితే కాసేపటికే.. రవిప్రకాష్‌ను.. ఆర్థిక అవకతవకల విషయంలో అరెస్ట్ చేశామని.. మీడియాకు సమాచారం ఇచ్చారు. టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్, మాజీ సీఎఫ్‌వో మూర్తి, ఫెరీరా అనే మరో మాజీ ఉన్నత ఉద్యోగిపై.. అలందా మీడియా కొత్త ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రమే బంజారాహిల్స్ పీఎస్‌లో టీవీ9 కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేసింది. దాదాపుగా ఆరు నెలల కిందట.. బోర్డు అనుమతి లేకుండా రూ.18.31 కోట్లను సొంత ఖాతాలకు మళ్లించారని ఫిర్యాదు చేశారు. తాము ఇప్పుడు రికార్డులు పరిశీలిస్తూండగా విషయం వెల్లడయిందని.. యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో తెలిపింది.
రవిప్రకాష్ దురుద్దేశపూర్వకంగా వ్యవహరించాడని అలందమీడియా ఆరోపించారు. విచారణకు సంబంధఇంచి 41 సీఆర్పీసీ ప్రకారం రవిప్రకాష్‌కు బంజారాహిల్స్ పోలీసుల నోటీసులు ఇచ్చారు. రవిప్రకాష్ నోటీసులు తీసుకోలేదని చెబుతూ.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా రూ. ఇరవై కోట్లు సొంత ఖాతాల్లోకి మళ్లిస్తే.. ఇంత కాలం ఎలా తెలియకుండా ఉంటుందని..రవిప్రకాష్ వర్గీయులు చెబుతున్నారు. ఇదంతా…కుట్ర పూరితంగా చేస్తున్న పనులని అంటున్నారు. మూడు రోజుల క్రితం శివాజీ… టీవీ9 కొత్త యాజమాన్య సంస్థ అయిన మెగా ఇంజినీరింగ్ కు చెందిన స్కాలంన్నీ ఆధారాలతో సహా బయట పెడతానని ప్రకటించారు.
ఆ తర్వాత హుటాహుటిన..ఈ కేసును రవిప్రకాష్ పై నమోదు చేయించారని అంటున్నారు. తెలంగాణ పోలీసుల తీరుపై..రవిప్రకాష్ చాలా రోజులుగా ఆరోపణుల చేస్తున్నారు. అలందా మీడియా యాజమాన్యంలో ఒకరైన మైహోం రామేశ్వరరావు .. చెప్పినట్లు పోలీసులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసు కొత్త మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.