టీవీ9 వాటాల అమ్మకం వివాదంలో.. హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో విచారణపై అలంద మీడియా సంస్థ స్టే తీసుకు వచ్చింది. ఎలాంటి విచారణ జరపకూడదని… ఆ సంస్థ ఢిల్లీలోని ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. అక్కడ జూలై 12 వరకూ ఎలాంటి ప్రొసిడీంగ్స్ వద్దని స్టే తెచ్చుకుంది. దాంతో.. ఈ రోజు ఎన్సీఎల్టీలో జరగాల్సిన కేసు విచారణ వాయిదా పడింది. హీరో శివాజీ… ఈ కేసును దాఖలు చేశారు. తనకు.. రవిప్రకాష్..కొన్ని షేర్లు అమ్మారని.. వాటి బదలాయింపు జరగలేదని.. ఆ లోపే… సంస్థ యాజమాన్యం మారిందనేది.. ఆ కేసు. ఈ కేసు విచారణ జరిగితే… టీవీ9 అమ్మకం విషయంలో.. కొత్త సందేహాలు, ఇక్కట్లు వస్తాయన్న ఉద్దేశంతో.. అలంద మీడియా.. విచారణపై స్టే కోరినట్లు తెలుస్తోంది.
మరోవైపు శివాజీ కొన్నారని చెబుతున్న షేర్ల విషయంలో… ఒప్పందం.. ఆయన చెప్పినట్లు గత ఏడాది ఫిబ్రవరిలోనిది కాదని.. ఈ ఏడాది ఏప్రిల్లోనిదేనని .. కొన్ని టీవీ చానళ్లకు…పోలీసులు లీకులు ఇచ్చారు. అవి.. రవిప్రకాష్ కు సంబంధించిన కంప్యూటర్ల నుంచి స్వాధీనం చేసుకున్నామని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… టీవీ9 ఆఫీసులోని రవిప్రకాష్ చాంబర్లో ఇతర చోట్ల ఏడు హార్డ్ డిస్క్లను తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అందులో నుంచి.. ఈ ఈమెయిల్స్ రీట్రివ్ చేసినట్లు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగా.. ఈ ఏప్రిల్లో చేసుకున్న ఒప్పందాన్ని… గత ఫిబ్రవరిలో చేసుకున్నట్లు చెబుతున్నారని.. ఇదో పెద్ద స్కాం అని.. సైబరాబాద్ పోలీసులు మీడియాకు సమాచారం ఇచ్చారు.
వాస్తవంగా ఇది పెద్ద సాక్ష్యం అయితే పోలీసులు ముందుగా… దీన్ని విచారణ సంస్థల ముందు ప్రజెంట్ చేయాలి. కానీ తమ లక్ష్యం అది కాదన్నట్లుగా.. కేవలం మీడియాకు సమాచారం ఇస్తే చాలన్నట్లుగా.. వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ ఈమెయిల్స్ కానీ..తాము బయటకు వెల్లడిస్తున్న సమాచారం కానీ ఏదీ అధికకారికం కాదు. తమకు సంబంధం లేదని..సైబర్ పోలీసులు చెబుతారు. ఎందుకంటే.. ఇలా లీక్ చేయడం చట్ట విరుద్ధం. అయినప్పటికీ… ఓ రకమైన ప్రచారం జరగడం..రవిప్రకాష్, శివాజీలు.. టీవీ9 అమ్మకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని.. దాని కోసం అడ్డదారులు తొక్కారనే విషయాన్ని ప్రచారం చేయాడానికే.. ఈ తరహా ప్రచారం చేస్తున్నారని.. కార్పొరేట్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి జూలై 12 వరకూ.. ఎన్సీఎల్టీలో కేసు విచారణకు రాదు కాబట్టి.. అప్పటి వరకూ.. టీవీ9 అమ్మకం వివాదం కొనసాగే అవకాశం ఉంది.