పవన్ కళ్యాణ్ సన్నిహితుడుగా పేరొందిన ఆలీ వైఎస్ఆర్సీపీలో చేరారు. వైస్సార్సీపీ లో చేరిన అనంతరం ,శపవన్ కళ్యాణ్ తో తన స్నేహం గురించి, పవన్ కళ్యాణ్ పార్టీలో చేరకపోవడం గురించి స్పందించారు. ఎందుకు తాను జనసేన లో చేరలేదో కారణాలను వివరించారు.
జనసేన లో చేరే విషయమై తాను పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్లు, అయితే దానికి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, జనసేన పార్టీలో చేరితే ప్రయాణం అంత సాఫీగా ఏమీ ఉండదని, రకరకాల ఇబ్బందులు ఉంటాయని తనకు వివరించినట్లు తెలిపారు. అలాగే తనకు నచ్చిన పార్టీలో చేరమని పవన్ కళ్యాణ్ తనకు సూచించినట్టు ఆలీ చెప్పుకొచ్చారు. అలాగే, ఆలీ వైయస్సార్సీపి లో చేరడం తో, పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని ఆలీ దృష్టికి తీసుకొని రాగా, పవన్ కళ్యాణ్ సక్సెస్ అయితే, ఒక ఫ్రెండ్ గా తాను కూడా సక్సెస్ అయినట్టే భావిస్తాను అని ఆలీ తెలిపారు.
ఏది ఏమైనా జనసేన పార్టీలో చేరి ఇబ్బంది పడడం ఇష్టంలేకనే, ఆలీ వై ఎస్ ఆర్ సి పి లో చేరడం అనే సులువైన దారిని ఎంచుకున్నట్లు గా అర్థం అవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తనతో పాటు ఇబ్బందికరమైన దారిలో నడవడానికి సిద్ధపడ్డ వారినే పార్టీలో చేర్చుకుంటున్న ట్టుగా అర్థమవుతోంది.
మరి ఆలీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి.