ఆలి నోటి దురుసుతనం అందరికి తెలిసిందే.. ప్రతీ ప్రోగ్రాంలో అసభ్యకరమైన మాటలు అనడం ఆ తర్వాత తగిన మూల్యాన్ని చెల్లించుకోవడం ఆలికి అలవాటే.. ఈ మధ్య అది ఇంకా బాగా ఎక్కువైంది. మొన్నామధ్య సమంత నడుము గురించి, రీసెంట్ గా సుమ యాంకరింగ్ గురించి గొడవల్లో చిక్కుకున్న ఆలి ప్రస్తుతం ‘సైజ్ జీరో’ ఆడియోలో అనుష్క తొడల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తున్నాయి. బిల్లా టైం నుండి అనుష్క తొడలంటే తనకు ఇష్టమన్న ఆలి కామెంట్స్ కి సిని ప్రముఖుల సైతం తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు.
అయితే ఆలికి ఇది కొత్తేం కాదు ఎప్పుడు ఏదో ఒక మ్యాటర్ పై హాట్ హాట్ కామెంట్స్ చేసి సెన్షేషన్ క్రియేట్ చేస్తాడు. అయితే ఈసారి ఆలికి స్టార్ హీరోల దగ్గర నుండి షాక్ తగిలిందని తెలుస్తుంది. ఆలి అనుష్క ని కామెంట్ చేసిన విషయం పట్ల ఓ పక్క మహిళా సంఘాలు కూడా తమ నిరసనను తెలియచేస్తుంటే మరో పక్క సినిమా ప్రముఖులు కూడా ఆలి ప్రవర్తనను తప్పు పడుతున్నారు. ఈ దారిలో స్టార్ హీరోలైన ప్రభాస్, రానాలు అనుష్క మీద చేసిన కామెంట్స్ గురించి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఫిల్మ్ నగర్ టాక్.
ఆలి కొద్దిరోజులుగా హీరోయిన్స్ ని టార్గెట్ చేస్తూ అందరి ముందు అసభ్య పదజాలం వాడడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఆలి కావాలనే అలా చేస్తున్నాడా లేక మరోదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే నోటి దూళకు పోతే తగినంత మూల్యన్నిచెల్లించుకుంటున్నాడు ఆలి. తనకంటే నటనలో చాలా తక్కువ అనుభవం ఉన్న వాళ్లతో కూడా షంటింగ్లు తింటున్నాడంటే ఆలికి ఇది అవమానమనే చెప్పాలి. మరి ఇప్పటికైనా ఆలి తన కామెంట్స్ ని విరమించుకుని.. నోరు అదుపులో పెట్టుకుంటే బెటర్ లెదంటే పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యే విధంగా కనిపిస్తున్నాయి.