ఏపీ అధికార పార్టీలో ఇప్పుడు రాజ్యసభ స్థానాల భర్తీ హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఓ స్థానం సినీ నటుడు అలీకి ఇస్తారన్న ప్రచారం జరిగింది. సీఎం జగన్ అలీని ప్రత్యేకంగా పిలిపించుకుని రెండు వారాల్లో శుభవార్త వింటారని చెప్పి పంపించారు. ఆయన ఆ మాట కోసం సతీసమేతంగా వచ్చారు. ఇప్పటికి రెండు నెలలు అవుతున్నా.. అలీకి తీపి కబురు అందలేదు. మరో వైపు రాజ్యసభ రేసులో ఆయన పేరు మెల్లగా వెనక్కి పోతోంది.
వచ్చే నెలలో రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వైసీపీకి వచ్చే నాలుగు సీట్లలో ఒకటి అదానీ కోటా అని ఎప్పుడో తేలిపోయింది. అదానీ భార్యను జగన్ రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకున్నట్లుగా వైసీపీలో గట్టిగా నమ్ముతున్నారు. ఇక రెండు స్థానాలు ఉంటాయి. ఒకటి విజయసాయిరెడ్డికి రెన్యూవల్ చేయాలి. ఆయనను విస్మరిస్తే.. నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే పరిస్థితులపై ఓ అవగాహనకు వచ్చింది కాబట్టి జగన్ ఆయనకు మళ్లీ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటే ఇక రెండు స్థానాలు మాత్రమే ఉంటాయి. అ రెండింటిలో మరొకటి జగన్ అక్రమాస్తుల కేసు వాదించే లాయర్ నిరంజన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. జగన్ ఆయనకు ఆ పదవి ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. అంటే మిగిలేది ఇక ఒక్క పోస్ట్. దాని కోసం చాలా మంది బీసీ నేతలు రెడీగా ఉన్నారు.
జగన్ పై సీనియర్ నేతలు అవకాశం కోసం ఒత్తిడి చేస్తున్నారు. దీంతో అనేక పేర్లు తెర ముందుకు వస్తున్నాయి. సినీ నటుడు అలీ పేరు మాత్రం ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. దీంతో సీఎం జగన్ రాజ్యసభ ప్రాబబుల్స్ నుంచి ఆయన పేరును తప్పించారని భావిస్తున్నారు. అదే నిజం అయితే.. అలీ రేసులోకి వచ్చిన వెంటనే ఔట్ అయినట్లు అవుతుంది. రెండు వారాల్లో గుడ్ న్యూస్ అని సీఎం జగన్ చెప్పారు కాబట్టి ఏదో ఓ నామినెటడె్ పోస్టును ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రచారం జరుగుతోంది.