పవన్ కళ్యాణ్ – అలీ మధ్య రాకూడని గ్యాప్ వచ్చేసింది. అలీ నన్ను మోసం చేసాడు అని… రాజమండ్రి ప్రజల ముందు పవన్ బయటపడిపోతే.. `నేను చేసిన మోసం ఏమిటి` అంటూ సొషల్ మీడియా సాక్షిగా ఆవేదన వ్యక్తం చేసాడు. నిజానికి వై కా పా కండువా కప్పుకున్నా ఎప్పుడూ పవన్ గురించి గాని, పవన్ పార్టీ గురించిగానీ ఒక్క మాట కూడా నెగిటివ్ గా మాట్లాడలేదు అలీ. పైగా… పవన్ స్థానం ఎప్పుడూ ఇక్కడే అంటూ తన గుండె ని చూపించాడు. ఇటు పవన్ కూడా అలీ గురించి, అలీ పార్టీ మారడం గురించి ఎప్పుడూ స్పందించడానికి ఇష్టపడలేదు. కానీ అలీ సొంత వూరు రాజమండ్రి వచ్చేసరికి అలీ, తన స్నేహం, చేసిన మోసం గుర్తొచ్చి.. అలీ ప్రస్తావన తీసుకొచ్చాడు.
ఆలీకి నేనెంతో చేశా అని పవన్ అంటే..
– ఏం చేశారో చెప్పండి సార్… అంటూ అలీ ఎదురు ప్రశ్నిస్తున్నాడు.
సినిమాలో ఇచ్చారా? ఆర్ధికంగా ధనసహాయం చేశారా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
పవన్ తోలి సినిమా చేసేటప్పటికే టాలీవుడ్ లో ఆలీ సెటిల్ ఐపోయాడు. ఇక అలీ కి పవన్ సహాయం చేసేదేముంది?
నా పార్టీ లోకి రాలేదు.. అనేది పవన్ మాట. నన్ను అసలు మీరు పిలవలేదు అనేది అలీ సమాధానం.
నరసారావు పేట ఎంపీ సీటు నా బంధువులకు నన్ను అడిగి ఇచ్చారా? అంటూ అలీ నిలదీసిన విధానం చూస్తుంటే.. అసలు ఆ సీటు కీ, ఆలీకి సంబంధం లేదనిపిస్తోంది. అలీ తన వీడియోలో పవన్ ని `సార్ సార్` అంటూ సంబోధించడం ఆకట్టుకుంది. చివర్లో ఓ వీడియో కూడా చూపించాడు. పవన్ కి తాను ఇచ్చే స్థానం ఏమిటో మరో సారి స్పష్టం చేసాడు. ఈ టోటల్ ఎపిసోడ్ తో ఇద్దరి స్నేహానికి మధ్య గ్యాప్ వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అది ఎప్పటికి పూడుతుందో ఏమో?