రాజమౌళి రూపొందిస్తున్న క్రేజీ మల్టీస్టారర్… RRR. ఇందులో రామ్ చరణ్ పక్కన అలియాభట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్.. రామ రాజు అయితే, అలియా సీత. ఈరోజే… అలియా సెట్లో కూడా అడుగుపెట్టేసింది. చరణ్, అలియాభట్ లపై ఈరోజు కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక సెట్ తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. అక్కడే ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. మరో పది రోజుల పాటు అలియాపైనే చిత్రీకరణ జరగబోతోందని తెలుస్తోంది. రామరాజు.. ఎలా ధీరోదాత్తుడో, సీత పాత్ర కూడా అదే స్థాయిలో ఉండబోతోందట. సీత ని సైతం ఈ చిత్రంలో ధైర్యశాలిగా చూపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం అలియా తెలుగు కూడా నేర్చుకుంటోందట. ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పకపోవొచ్చు గానీ, తెలుగుని అర్థం చేసుకోవడానికీ, కనీసం సెట్లో డైలాగులు చెప్పడానికి అది ఉపకరిస్తుంది.