మరి కొద్దిగంటల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల పండగ మొదలుకాబోతుంది. గత రెండు వారాలుగా పొలిటికల్ స్పీచులతో ఆదరగొట్టేసిన పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం ‘అజ్ఞాతవాసి’ కబుర్లు చెప్పబోతున్నాడు. ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్ లో ఎక్కడ విన్నా ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఈవెంట్ ముచ్చట్లే. అయితే ఈలోగా ‘అజ్ఞాతవాసి’ ఆడియో ట్రాక్ లిస్టు బయటకివచ్చింది. ఈ ట్రాక్ లిస్టు ను పరిశీలిస్తే.. రెండే పాటలు మిగిలున్నాయి.
ఇప్పటికే’ బయటికివచ్చి చూస్తే’.. గాలివాలుగా, మధుర పురి సుధన .. పాటలు వినిపించేశారు. ఇక ఆడియో లో మిగిలింది రెండే పాటలు. ధగ ధగ మెసిరే.. ఎబీ ఎవరో నీ బే.. అనే పల్లవులతో సాగే రెండు పాటలే వున్నాయి వినడానికి. వాస్తవానికి మూడు పాటలు ఇంకా మిగులుంటాయి అని భావించారు. మధుర పురి సుధన ని జస్ట్ ట్రాక్ గా వాడుంటారని అంచనా వేశారు. కానీ ఆ కీర్తనని కూడా ఆడియోలో చేర్చేశారు.
అయితే ఆడియో ట్రాక్ లిస్టు పై చిన్న డౌట్. అత్తారింటికి దారేదిలో కూడా కాటమరాయుడా అనే పాటను ట్రాక్ లిస్టు లో పెట్టలేదు. సినిమాలో సర్ ప్రైజ్ చేశారు. ‘అజ్ఞాతవాసి’ కోసం ‘కొడకా కోటీశ్వరా’ అనే పాటను కంపోజ్ చేశారని వార్తలు వచ్చాయి. మరి ఈ పాటను డైరెక్ట్ గా సినిమాలో పెడతారేమో చూడాలి. ఎందుకంటే పవన్ ఊహతీయం కదా.