‘పుష్ప 2’ తరవాత అల్లు అర్జున్ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. త్రివిక్రమ్, అట్లీ బన్నీ కోసం కథలు సిద్థం చేస్తున్నారు. ఓ బాలీవుడ్ దర్శకుడు సైతం బన్నీకి టచ్లో ఉన్నాడు. ఇప్పుడు బోయపాటి శ్రీను కూడా బన్నీకి ఓ కథ చెప్పి `ఓకే` చేయించుకొన్నాడు. బన్నీ – బోయపాటిది హిట్ కాంబో. వీరిద్దరి నుంచి `సరైనోడు` వచ్చింది. అప్పటికి బన్నీ కెరీర్లో ‘సరైనోడు’ పెద్ద హిట్. ఆ రికార్డుల్ని ఆ తరవాత ‘అల వైకుంఠపురములో’ బ్రేక్ చేసింది. అప్పటి నుంచీ బన్నీ -బోయపాటి రెండో సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బోయపాటి కూడా బన్నీని దృష్టిలో ఉంచుకొని ఓ పవర్ ఫుల్ స్క్రిప్టు సిద్ధం చేశారు. ఇటీవలే.. బన్నీకి వినిపిస్తే.. ఆయన ‘ఓకే’ చెప్పేశారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ తెరకెక్కించనుందని టాక్.
బోయపాటితో బాలయ్య సినిమా కూడా చర్చల దశలో ఉంది. అయితే బాలకృష్ణ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. చాలామంది దర్శకులకు ఆయన సినిమా చేస్తానని మాట ఇచ్చారు. 2024 ఎన్నికల ముందు బోయపాటితో సినిమా చేద్దామనుకొన్నా, ఇప్పుడు అంత టైమ్ లేదు. సింహా, లెజెండ్, అఖండ తరవాత వచ్చే సినిమా కాబట్టి… భారీ అంచనాలు ఉంటాయి. కాబట్టి… బోయపాటి కూడా బాలయ్యతో సినిమా విషయంలో పెద్ద తొందర పడడం లేదు. బన్నీ నిర్ణయం బట్టి బోయపాటి తదుపరి సినిమా ఏమిటన్నది డిసైడ్ అవుతుంది.