సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం `బ్లఫ్ మాస్టర్`. గణేష్ దర్శకుడు. తమిళంలో విజయవంతమైన శతురంగ వేట్టైకి ఇది రీమేక్. తెలుగులో ఓకే అనిపించుకుంది. `శతురంగ వెట్టై`కి తమిళంలో సీక్వెల్ కూడా వచ్చింది. ఇప్పుడు తెలుగులో కూడా `బ్లఫ్ మాస్టర్`ని మరోసారి తెరకెక్కించబోతున్నారని సమాచారం. సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తారు. గణేష్ దర్శకుడు. సి.కల్యాణ్ ఈ చిత్రానికి నిర్మాత. సత్యదేవ్, గణేష్ కాంబినేషన్లో ఓసినిమా వస్తోందని, త్వరలోనే పట్టాలెక్కుతుందని సి.కల్యాణ్ ప్రకటించారు. అయితే అది బ్లఫ్ మాస్టర్‌కి సీక్వెలా? కాదా? అనేది మాత్రం చెప్పలేదు.
అంతేకాదు.. బాలకృష్ణతో మరో సినిమా చేయడానికి సి.కల్యాణ్ ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. ఇది వరకు వినాయక్ ని తీసుకెళ్లి బాలయ్యకు కథ చెప్పించారు. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. కె.ఎస్. రవికుమార్ తోనూ కల్యాణ్ ఓ సినిమా చేస్తానని ప్రకటించారు. బహుశా.. బాలయ్య – కె.ఎస్.రవికుమార్ కాంబోని మరోసారి రిపీట్ చేస్తారేమో చూడాలి