తెలంగాణ మంత్రి వర్గాన్ని డిసెంబర్ ఏడో తేదీలోపే విస్తరించే అవకాశం ఉంది. ఆ రోజుకి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. ఆరు మంత్రి పదవుల్ని ఖాళీగా ఏడాది ఉన్నట్లు అవుతుంది. ఎంతో మంది ఆశావహులు ఉన్నా పార్టీ కోసం పదేళ్ల పాటు పని చేసినా అవకాశం రాని వారు నిరాశలో ఉన్నారు. అలాగే కొన్ని ఉమ్మడి జిల్లాలకు.. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. మొత్తంగా పన్నెండు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఈ విషయం పాలనపై ప్రభావం చూపుతోంది.
రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ ను కలిసి పేర్లను ఇచ్చి వచ్చారు . వీలైనంత త్వరగా అనుమతి కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి ఏడాది గడిచే లోపే ఈ విస్తరణ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. అంత కంటే ఎక్కువ ఆలస్యమైతే సమస్యలు వస్తాయని ..రేవంత్ కూడా హైకమాండ్ కు పదే పదే చెబుతున్నారు. రేవంత్ ఏడాది పాలనపై హైకమాండ్ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తోంది.
ఈ క్రమంలో ఫలితాలు వచ్చిన రోజు అయిన డిసెంబర్ మూడో తేదీన హైదరాబాద్లోని బహిరంగసభను నిర్వహించాలని అనుకుంటున్నారు. డిసెంబర్ 3వ తేదీన హైదరాబాద్లో భారీ బహిరంగ స భ నిర్వహించాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రాహుల్, ప్రియాంక గాంధీల్లో ఎవరినో ఒకరిని ఈ సభకు వచ్చేలా రేవంత్ చొరవ తీసుకోనున్నారు. వారు రాని పక్షంలో మల్లికార్జునఖర్గేను ఆహ్వానించే అవకాశం ఉంది.