సాగర్ చంద్ర మంచి విషయం వున్న దర్శకుడు. ‘అయ్యారే’ లాంటి సినిమాతో పరిశ్రమలో అడుగుపెట్టి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ లాంటి డిఫరెంట్ సినిమాతో అలరించాడు. అయితే పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో మాస్ ఆడియన్స్ కి సాగర్ పేరు తెలిసింది. పవన్ కళ్యాణ్, ఫ్యాన్స్ కోరే విధంగా ప్రజెంట్ చేసి ఫ్యాన్స్ మనసు గెలుచుకున్నాడు. ఇప్పుడు మరో మెగా మూవీ కి సంతకం చేశాడు. వరుణ్ తేజ్ తో సాగర్ కొత్త సినిమా ఓకే అయ్యింది. హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో ఈ కథ వుండబోతుంది. నిజానికి భీమ్లా నాయక్ కంటే ముందే వరుణ్ సినిమా ఓకే అయింది. అయితే బడ్జెట్ విషయంలో కొంచెం వెనక్కి తగ్గారు. చాలా ఖర్చుతో కూడుకున్న కథ. అప్పటికి హిస్టారికల్ నేపధ్య వున్న సినిమాలు ఎంతవరకూ సేఫ్ అనే ఆలోచన నిర్మాతల్లో వుంది. అయితే ఇప్పుడు హిస్టారికల్ మూవీలకు క్రేజ్ వచ్చింది. పైగా పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ లాంటి మాస్ హిట్ ఇచ్చిన దర్శకుడిగా సాగర్ కి కొత్త ఇమేజ్ వచ్చింది. దీంతో పైప్ లైన్ లో వున్న సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి రంగం సిద్దమైయింది. ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు సాగర్. వరుణ్ తేజ్ ‘గని’ విడుదలైన వెంటనే సాగర్ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వుంది.