ఏపీకి వస్తుందా… గుజరాత్ ఎగురేసుకపోతుందా… అన్న అనుమానాలు. ఎలాగైనా ఏపీకి తీసుకరావాలన్న పట్టుదల. సీఎం చంద్రబాబు మంత్రాంగం… ఎట్టకేలకు ఏపీకి భారీ పెట్టుబడి రాబతుంది.
దేశంలోని ప్రముఖ ఆయిల్ కంపెనీ బీపీసీఎల్ ఓ ప్లాంట్ ను పెట్టాలనుకుంది. అనువైన, తీర ప్రాంతం ఉన్న ప్రదేశం కోసం చూస్తున్న సమయంలో ఏపీ, గుజరాత్ రాష్ట్రాలు పోటీ పడ్డాయి. గుజరాత్ బీపీసీఎల్ కంపెనీకి అనుమతుల విషయంలో వేగంగా పూర్తి చేస్తామని ఆఫర్ చేసింది. అంత స్పీడ్ గా ఆనాటి జగన్ సర్కార్ స్పందించకపోవటం, స్థలం విషయంలో ఊగిసలాట ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు గుజరాత్ కే అని అంతా ఫిక్స్ అయ్యారు.
కానీ, సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశాక వేగంగా స్పందించారు. బీపీసీఎల్ ను ఏపీకి వచ్చేలా అధికారులను పరుగెత్తించారు. వీరికి తోడు మచిలీపట్నం ఎంపీ బౌలశౌరి బీపీసీఎల్ ప్రతినిధులతో టచ్ లో ఉంటూ… ఇటు ప్రభుత్వానికి అటు కంపెనీకి మధ్య అనుసంధాన కర్తగా ఉంటూ రాష్ట్రానికే వచ్చేలా చొరవ చూపారు.
ఫలితంగా బీపీసీఎల్ రిఫైనరీ ప్లాంట్ ఏపీకే రావటం దాదాపు ఖాయం అయిపోయింది. బుధవారం మధ్యాహ్నం ఆ కంపెనీ ప్రతినిధులు సీఎంతో సమావేశం కాబోతున్నారు. కంపెనీ ఏపీలో ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తికరంగా ఉందని, ఈ కంపెనీ వల్ల స్థానికంగా 25వేల ఉద్యోగాలు… పరోక్షంగా ఎంతో లబ్ధి చేరుతుందని ఎంపీ బాలశౌరి అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, ఎన్డీయే కూటమి వల్లే ఇది సాధ్యమయ్యిందన్నారు.