రైతు రుణమాఫీ అవుతుంది..నిరుద్యోగుల డిమాండ్ ల మేరకు గ్రూప్ 2 ను వాయిదా వేశారు..పోస్టుల పెంపుపై కూడా చర్చిస్తామని సర్కార్ ప్రకటించింది.. దీంతో బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
రైతుబంధు నిధులనే రుణమాఫీకి మళ్లిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నా.. రైతుల నుంచి ఎలాంటి పాజిటివ్ రియాక్షన్ ఉండటం లేదు. అలాగే, నిరుద్యోగులు కూడా సర్కార్ తాజా నిర్ణయంతో సైలెంట్ కావడంతో బీఆర్ఎస్ కు మిగిలిన ఏకైక అస్త్రం.. పార్టీ ఫిరాయింపులే. దీని ద్వారానే రాజకీయం చేసే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంలో బీఆర్ఎస్ కు బయటి నుంచి సానుభూతి లభించే అవకాశం లేదు. గతంలో ఇబ్బడిముబ్బడిగా నేతలను జాయిన్ చేసుకోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ ను ప్రశ్నిస్తున్నారని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
అసెంబ్లీని కాంగ్రెస్ కార్నర్ చేసేందుకు ఏ అస్త్రాన్ని ప్రయోగించాలి అనే విషయంపై పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఆరు గ్యారంటీలలో పెండింగ్ లో ఉన్న హామీలు..నిరుద్యోగ భృతి..పార్టీ ఫిరాయింపులపై సర్కార్ ఇరుకున పెట్టేలా అసెంబ్లీనివేదికగా చేసుకోవాలని కేసీఆర్ సూచించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ విషయాల్లో బీఆర్ఎస్ ఫైట్ చేస్తున్నా.. ప్రజల నుంచి మద్దతు లభించకపోవడంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది ఆసక్తి రేపుతోంది.