రాజకీయ నాయకులు మీడియా ముందు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటారు. తెరవెనుక ఒకరి సహకారాన్ని మరొకరు కోరుకుంటారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇలాంటి రూమరే ఒకటి తెగ హల్చల్ చేస్తోంది. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఒకరు తన గెలుపు సహకరించాల్సిందిగా చిరంజీవిని కోరారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, చిరంజీవి ని ఎందుకు కోరారు, దానికి చిరంజీవి ఏం సమాధానమిచ్చారు.. వివరాల్లోకి వెళితే..
వైఎస్సార్సీపీ తరఫున ఏలూరు ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న ఆళ్ళ నాని గతంలో చిరంజీవి అభిమానిగా, చిరంజీవి అభిమాన సంఘం నాయకుడి గా ఉన్నారు. ఆ పరిచయంతో, ఈ మధ్య చిరంజీవిని ప్రత్యేకంగా కలిసారు. ఏలూరు నుండి వైఎస్ఆర్సిపి పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని, మీ ఆశీర్వాదం కావాలి అని, ఈ ఒక్కసారికి ఏలూరులో జనసేన పార్టీ తరఫున న బలమైన అభ్యర్థిని కాకుండా కాస్త బలహీనమైన అభ్యర్థిని పోటీ చేయించేలా పవన్ కళ్యాణ్ కి చెప్పండి అంటూ చిరంజీవిని కోరారట. అయితే చిరంజీవి, రాజకీయ సంబంధించిన అంశాల్లో జనసేన లో తన జోక్యం ఏమాత్రం లేదని, ఒకవేళ తాను చెప్పినా, పవన్ కళ్యాణ్ దాన్ని వింటాడని తాను అనుకోవడం లేదు నాని కి సమాధానమిచ్చాడట. ఇది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో లో వినిపిస్తున్న రూమర్.
గతంలో కూడా కిల్లి కృపారాణి జనసేన పార్టీలో లో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తమ్ముడు తో ఒక మాట చెప్పమని చిరంజీవిని కలిసి కోరినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా చిరంజీవి ఇదే తరహా లో సమాధానం ఇచ్చినట్లు, జనసేన విషయంలో తాను ఏ రకంగాను సహాయం చేయలేనని చెప్పినట్లుగా అప్పుడు పుకార్లు షికార్లు చేశాయి. మొత్తానికి అప్పుడు కృపా రాణికి, ఇప్పుడు నాని కి చిరంజీవి ఇచ్చిన సమాధానాన్ని బట్టి చూస్తే, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకుల విషయంలో, అభ్యర్థుల విషయంలో చిరంజీవి తో సహా ఎవరి ప్రభావానికి లోను కావడం లేదని, తనకంటూ ఒక సిస్టమేటిక్ విధానాన్ని ఏర్పరుచుకుని, దాని ప్రకారం పూర్తి స్థాయిలో ముందుకు వెళుతున్నాడు అని అర్థమవుతుంది. అదే సమయంలో ఏలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జనసేన పార్టీ ప్రభావం గురించి కాస్త మధనపడుతున్నారు అని కూడా అర్థం అవుతోంది.