‘మహర్షి’తో రూటు మార్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తాడు అల్లరి నరేష్. ఆ సినిమా హిట్టయ్యింది. నరేష్ కీ మంచి పేరొచ్చింది. కానీ.. మళ్లీ అలాంటి అటెమ్ట్ చేయలేదు. ఈసారి.. నాగార్జున సినిమాలో మళ్లీ కీ రోల్ చేశాడు. అదే ‘నా సామిరంగ’. బిన్ని దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో కథానాయకుడి స్నేహితుడి అంజిగా నరేష్ దర్శనమివ్వబోతున్నాడు. ఈ క్యారెక్టర్ ని గ్లింప్స్ ద్వారా ఈరోజు పరిచయం చేశారు. రంగు రంగుల కాస్ట్యూమ్స్ తో.. పూర్తి స్థాయి మాస్ అవతార్ లో దర్శనమిచ్చాడు అంజి. తన గెటప్ బాగుంది. నరేష్ కి అచ్చంగా సూటైపోయింది. ‘చేసేయ్ చేసేయ్.. లేదంటే మాటొచ్చేస్తుంది’ అంటూ తన మానరిజాన్ని చిన్న గ్లింప్స్ తోనే చూపించేశారు. హీరో క్యారెక్టర్‌తో అంజికి ఉన్న రిలేషన్‌ని కూడా బాగా ఆవిష్కరించారు. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.